
APPSC CIVIL Draughtsman Grade-2 Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ – II (టెక్నికల్ అసిస్టెంట్) ఉద్యోగాల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది ? ఎంపిక విధానం ఏమిటి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? వంటి వివిధ అంశాల పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🏹 Join Our What’sApp Group – Click here
Table of Contents :
🔥 APPSC CIVIL Draughtsman Grade-2 Notification Released by the Organization :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
🔥 APPSC to fill up the vacancies :
- ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో పనిచేసేందుకు గాను డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ – II ( టెక్నికల్ అసిస్టెంట్ ) ఉద్యోగాలు ను భర్తీ చేస్తున్నారు.
🔥 Number of posts to be filled by APPSC :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥APPSC CIVIL Draughtsman Grade-2 Age Details :
- 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టి , బిసి , ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు ప్రభుత్వ నియమ నిబంధన మేరకు వయోసడలింపు లభిస్తుంది.
🔥APPSC CIVIL Draughtsman Grade-2 (Technical Assistant) :
- డ్రాఫ్ట్స్‌మన్ ( సివిల్ ) విభాగం నందు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో సంబంధిత ట్రేడ్ విభాగం నుండి ఐటిఐ లేదా పొంది ఉండాలి.
🔥 దరఖాస్తు చేయు విధానము :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారికి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- గతంలో ఓటర్ క్రియేట్ చేసుకున్నవారు డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటిపిఆర్ క్రియేట్ చేసుకుని వారు ముందుగా OTPR క్రియేట్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజు తో పాటుగా 80 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును మొత్తం 330 రూపాయలు ను చెల్లించాలి.
- అయితే ఎస్సీ , ఎస్టి , బీసీ , ఎక్స్ సర్వీస్ మెన్ , రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు , నిరుద్యోగులు కి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 80 రూపాయలు నుండి మినహాయింపు కలదు. వీరు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
- దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే చెల్లించాలి .
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్షా విధానం :
- వ్రాత పరీక్షలో భాగంగా మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
- మొదటి పేపర్ : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ.
- రెండవ పేపర్ : ఐటిఐ ( సివిల్ డ్రాఫ్ట్ మెన్ ).
- ఒక్కొక్క పేపర్ నుండి 150 ప్రశ్నలు చొప్పున మొత్తం 300 ప్రశ్నలు , 300 మార్కులు కు గాను ఒక్కొక్క పేపర్ కు 150 నిమిషాలు చొప్పున 300 నిమిషాల సమయం కేటాయిస్తారు.
- వ్రాత పరీక్ష ఒకే రోజు రెండు సెషన్స్ లో ( paper -1 : morning session & paper – 2 : afternoon session ) జరుగుతుంది.
🔥వ్రాత పరీక్షా కేంద్రాలు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు మూడు జిల్లాలను పరీక్షా కేంద్రాల నిమిత్తం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 23 జిల్లాలలో పరీక్ష నిర్వహిస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారు కి 34,580 /- నుండి 1,07,210 /- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 18/09/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08/10/2025 ( రాత్రి 11:00 గంటల లోగా )
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉండి , ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విరివిగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించగలరు.