రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్య భీమా | 25 లక్షల కవరేజీతో ఉచిత ఆరోగ్య భీమా

AP Government New Health Insurance Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మరో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ఆమోదించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కవర్ అయ్యేలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లభించేలా కొత్తగా ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ ఆరోగ్య భీమా పథకం ఏ విధంగా అమలు కానుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య శ్రీ పథకం ఎలా భాగం కానుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఏ విధంగా ఉపయోగపడుతుంది వంటి వివిధ అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.

ఏపీలో పదో తరగతి అర్హతతో ఆశ కార్యకర్త ఉద్యోగాలు – Click here

🔥 రాష్ట్రంలో కొత్త ఆరోగ్య విధానం – ప్రజలందరికీ అందరికి ఆరోగ్య భీమా (New health policy in the state – Health insurance for all people :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులు అందరికీ వర్తించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య విధానాన్ని ఆమోదించింది.
  • గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ఆరోగ్య విధానానికి ఆమోదముద్ర వేశారు.
  • రాష్ట్రంలో ఇప్పటికీ అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ మరియు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పథకం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాలను సమ్మిళితం చేసి , కొత్త హైబ్రిడ్ ఆరోగ్య విధానాన్ని అమలు చేయడం జరగనుంది.
  • రాష్ట్రంలో గల ప్రజలందరికీ ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారు.
  • ఈ పథకం ద్వారా పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించనున్నారు.

🔥 కొత్త ఆరోగ్య భీమా పథకం అమలు చేయు విధానం (Implementation procedure of the new health insurance scheme) :

  • రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసింది గాను రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచేందుకు నిర్ణయించింది.
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ ఆరోగ్య విధానానికి సంబంధించి భీమా కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించేందుకుగాను వీలుగా వైద్య మరియు ఆరోగ్య శాఖ అందజేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.
  • రాష్ట్రంలో గల అందరికీ 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా అనగా 2.5 లక్షల నుండి 22.5 లక్షల వరకు గల మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలను అందించనున్నారు.

కౌశలం సర్వేలో ఇలా అప్లై చేయండి – Click here

🔥 ఎవరెవరికి ఈ ఆరోగ్య భీమా పథకం వర్తించనుంది (Who will be covered by this health insurance scheme?) :

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్రంలో గల పేదలందరికీ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది.
  • రాష్ట్రంలో గల ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.
  • ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పథకంలో భాగం అయిన వారికి తప్ప మిగతా అందరు ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • దారిద్రరేఖకు ఎగువన ఉన్నవారికి (APL) వారికి 2.5 లక్షల వరకు వైద్య భీమా అందిస్తారు.
  • రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ ఆరోగ్య విధానంలో భాగం కానున్నారు.

🔥 ఆరు గంటలలో ఉచిత వైద్యానికి అనుమతి :

  • ఈ పథకంలో నమోదైన ప్రజల ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్ నందు జాయిన్ అయితే వారికి హాస్పిటల్లో జాయిన్ అయినా 6 గంటలలోగా ఉచిత వైద్యం లభించేలా చర్యలు తీసుకుంటారు.
  • హాస్పిటల్ బిల్లులను కేవలం 15 రోజుల్లోనే రియంబర్స్ చేస్తారు.
  • 3257 వైద్య సేవలను ఈ పథకంలో భాగంగా ప్రజలందరికీ అందజేస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో అయితే 324 వైద్య సేవలకు గాను ఈ పథకం వర్తిస్తుంది.
  • హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి పేషంట్ కి కూడా క్యూఆర్ కోడ్ కేటాయించి , వీరికి అందుతున్న వైద్య సేవలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు.
  • ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కాల్ సెంటర్ & కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తారు.
  • ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సి ఉన్నందున యుద్ధ ప్రాదిపాతికన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
  • రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నందు రిజిస్టర్ కాబడిన 2493 నెట్వర్క్ హాస్పిటల్స్ లలో కూడా ఈ క్రొత్త యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పథకం వర్తిస్తుంది.
  • రాష్ట్రంలో గల ప్రజలందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లో భాగం కావాలన్న మంచి ఉద్దేశ్యం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

🔥 10 వేల కోట్లకు పైగా ఆర్థిక భారం :

  • రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కొరకు పెద్ద మొత్తంలోనే డబ్బులు వెచ్చించాల్సి ఉంది.
  • ఈ పథకం అమలు కొరకు సుమారుగా పదివేల కోట్ల నుండి 12 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
  • ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి జరగనుంది.
  • ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
  • ఇందులో భాగంగా ఈ సేవలను పొందుతున్న వారిలో 95 శాతం మంది ప్రజలకు 2.5 లక్షల లోపు ఖర్చు అవుతుంది. ఇంకో 5 శాతంలో 3 శాతం మందికి 5 లక్షల వరకు & 2 శాతం వారికి 15 లక్షల లోపు ఖర్చు అవుతున్నట్లు గణాంకాలు ద్వారా తెలుస్తుంది.
  • ఈ ధనాంకర్ ఆధారంగా అధికారులు పంపించిన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
  • రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 2.5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించేలా అధికారులు ప్రతిపాదించారు.
  • మిగతా మొత్తానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డు ఇవ్వనున్నారు.

ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్యక్రమానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం అధికారికంగా రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయున ఈ ఆరోగ్య బీమా పథకం సంబంధించి లభించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది.

Related Posts

ఈ తేదిన అన్నదాత సుఖీభవ పథకం 21వ విడత నిధులు జమ
  • adminadmin
  • September 25, 2025

రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో…

Read more

Continue reading
AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
  • adminadmin
  • September 14, 2025

AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *