
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అలానే ఇటీవల రాష్ట్రంలో పెన్షన్లు రీ వెరిఫికేషన్ మరియు రీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా కొన్ని దివ్యాంగ మరియు ఆరోగ్య పెన్షన్లు రద్దు అంశంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అలానే PM స్వానిధి పథకం మరియు పశువుల కొరకు ప్రభుత్వం కొత్తగా భీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇక్కడ పేర్కొన్న వివిధ అంశాల కొరకు ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 ప్రతి ఫ్యామిలీ కి ఒక కార్డ్ – ముఖ్యమంత్రి గారు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు.
- ఈ కార్డ్ ద్వారా ప్రజలందరికీ అందించే సంక్షేమ పథకాల వివరాలు తెలిసేలా మానిటర్ చేయాలని తెలిపారు.
- కుటుంబాలకు అందించే అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఒకే స్మార్ట్ కార్డ్ లో తెలిసేలా చేయాలని , స్మార్ట్ కార్డ్ లో వివరాలు అన్నీ పొందుపరచాలి అని ప్రస్తావించారు.
- వ్యవస్థ పై ప్రజలకు అవగాహన కల్పించేలా , పారదర్శకత మరియు సంక్షేమ పథకాల సద్వినియోగం కోసం ప్రత్యేక పద్ధతి ప్రవేశపెట్టాలని తెలిపారు.
- సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు గాను కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు అని , అవసరం అయితే సంక్షేమ పథకాల అమలు విషయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాలి అని తెలిపారు.
🔥 అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి పెన్షన్లు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి :
- రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ పెన్షన్లు అందాలని , అర్హత కలిగి ఉండి పెన్షన్ రాలేదని ఫిర్యాదు వస్తే సంబంధిత కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే . విజయానంద్ గారు తెలియజేశారు.
- ఇటీవల రాష్ట్రంలో పెన్షన్లు రీ అసెస్మెంట్ ప్రక్రియ జరిగినందు వలన ఆయన ఈ ప్రకటన ఇచ్చారు.
- కలెక్టర్ లు, మండల ప్రత్యేక అధికారులు , పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని ఆదేశించారు.
- పెన్షన్ పంపిణీ కార్యక్రమం ను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి , మీడియా మరియు సోషల్ మీడియాలో పెన్షన్ రాలేదనే వార్తలకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పారు.
- ఈటీవీలో జరిగిన పెన్షన్ తనిఖీల్లో భాగంగా అన్నదాత నోటీసులు వచ్చిన వారిలో 8 శాతం మంది అప్పీల్ చేసుకున్నారని , 20 శాతం మంది అప్లై చేసుకోలేదని , వారు కూడా అప్పీల్ చేసుకునేందుకు సుముకుత వ్యక్తం చేస్తే వెంటనే ఆపిల్ చేయాలని తెలిపారు.
- ఆపిల్ చేసుకున్న దరఖాస్తులన్నింటినీ కూడా నెలరోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
- నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి ఈనెల పెన్షన్ కొనసాగుతుందని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
🔥 యూరియా కొరత లేదు : మంత్రి అచ్చెన్నాయుడు
- రాష్ట్రంలో గల రైతులందరికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు శుభవార్త తెలియచేశారు.
- రైతులకు యూరియా అవసరాల దృశ్యా రాష్ట్రానికి 10, 350 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని , దీనికొరకు కేంద్ర రసాయనాలు ఎ ఎరువులు శాఖా మంత్రి తో మాట్లాడానని ఆయన తెలిపారు.
- కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి యూరియా పంపేందుకు గాను G.O విడుదల చేసింది అని తెలిపారు.
- ముందుగా రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యూరియాను పంపిస్తామని , ఇందుకొరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
- అలానే సెప్టెంబర్ మొదటి వారంలో 30000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది అని హామీ ఇచ్చారు.
🔥 రాష్ట్రంలో పాడి రైతుల కొరకు కొత్త బీమా పథకం :
- రాష్ట్రంలో పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. అతి తక్కువ ధరతో పశువులకు భీమా కల్పించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా కేవలం 384/- రూపాయలు చెల్లించి భీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- భీమా చేసిన పశువుకు 3 సంవత్సరాలు పాటు ఇన్సూరెన్స్ లభిస్తుంది.
- మీ గ్రామ సచివాలయం లో గల పశు సంవర్ధక సహాయకుడు ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వ్యాపారులకు శుభవార్త – 50 వేల రుణం :
- దేశంలో గల వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది.
- గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్న PM స్వానిధి పథకం ను మార్చి 2030 వరకు పొడిగించింది. అలానే రుణ పరిమితిని కూడా గరిష్టంగా 50,000 రూపాయలకు పెంచింది.
- గతంలో మొదటి సంవత్సరం 10 వేల రూపాయలు రుణం ఇచ్చేవారు , ప్రస్తుతం దీనిని 15 వేలకు పెంచింది. రెండో సంవత్సరం ఇచ్చే రుణాన్ని 25 వేలకు పెంచింది.
- వీధి వ్యాపారులకు మరియు చిరు వ్యాపారులకు ఇది ఒక మంచి అవకాశం.