
రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ను అమలు చేస్తున్నారు. ఈ పథకాలకు సంబందించి పలు కీలక అప్డేట్స్ లభించాయి. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఉల్లి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెలియజేసింది. అలానే రాష్ట్రంలో పంటలు పండిస్తున్న రైతులు అందరూ ఈ -పంట నమోదు లో భాగం కావలసి ఉంది. వీటన్నింటి గురించి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 అక్టోబర్ 18న రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ :
- రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. ఇటీవల ఆగస్టు 02 వ తేదీన పీఎం కిసాన్ పథకం యొక్క 20వ విడత నగదు జమ చేసిన ప్రభుత్వం , 21వ విడత ను దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన జమ చేయనుంది.
- పీఎం కిసాన్ పథకం 21వ విడత లో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను జమ చేస్తుంది.
- పీఎం కిసాన్ పథకం నగదు జమ చేసిన రోజు న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం యొక్క 2 వ విడత నగదు కూడా జమచేస్తారు. ఇందులో భాగంగా 5,000/- రూపాయలను జమ చేస్తారు. అంటే అక్టోబర్ 18 వ తేదీన అర్హత కలిగిన రైతుల ఖాతాలలో 7,000/- రూపాయలు జమ అవుతుంది.
🔥 కౌలు రైతులకు బంపర్ ఆఫర్ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.
- కౌలు రైతులకు సంవత్సరానికి 20,000/- రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొత్తం 20,000/- రూపాయలను అందించనుంది. ఇందులో భాగంగా 10,000/- రూపాయలను అక్టోబర్ నెలలో అందజేస్తారు.
- కౌలు రైతుల గుర్తింపు కొరకు CCRC కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 5.9 లక్షల కౌలు రైతుల గుర్తింపు కార్డ్ లను అందించారు.
🔥 ఉల్లి రైతులకు హెక్టార్ కి 50,000/- రూపాయలు :
- ఉల్లి పండించే రైతుల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- రాష్ట్రంలో ఉల్లి పండించే ప్రతి రైతుకు హెక్టర్ కి 50 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారి ప్రకటన కూడా చేశారు.
- ఉల్లి పండించే రైతులపై భారాన్ని తగ్గించే విధంగా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు.
- ప్రభుత్వం అందించే మొత్తం 50,000/- రూపాయలలో కేంద్ర ప్రభుత్వ వాటా 17,500/- రూపాయలు కాగా , మిగతా 32,500/- రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది.
- ఇటీవల ఉల్లి ధర బాగా తగ్గడంతో , ఉల్లి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి వద్ద ఉన్న బుల్లి పంటను అమ్మకం పెట్టగా అది వారు పంట ట్రాన్స్పోర్ట్ చేసిన ఖర్చు కంటే తక్కువగా రావడంతో బుల్లి రైతులు దిగాలు పడ్డారు. దీంతో పంటను పండించిన సరే రైతులకు నష్టమే కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని , రైతులకు ఆర్థికంగా సహాయం చేసేందుకుగాను ముందుకు వచ్చింది.
- రైతులకు హెక్టార్ కి 50 వేల రూపాయలు అందించడంతో , కనీసం మళ్లీ పంట పండించేందుకు పెట్టుబడి సహాయంగా ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
- రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉల్లి రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- రాష్ట్రంలో అధికారులు నమోదు చేసిన ఈ – పంట ఆధారంగానే ఉల్లి రైతులకు 50 వేల రూపాయలు అందించనున్నారు.
🔥 ఈ – పంట నమోదుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట పండిస్తున్న రైతులందరూ తప్పనిసరిగా సెప్టెంబర్ 30వ తేదీలోగా ఈ పంట నమోదు పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
- ఈ – పంట లో రైతులు వారి పంటను నమోదు చేయడం ద్వారా రైతులకు పంట సాయం , పంట నష్టపరిహారం , పంటల భీమా మరియు ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అన్ని అందుతాయి.
- రాష్ట్రంలో ఉన్న రైతు సేవా కేంద్రాలలో గల వ్యవసాయ సహాయకులు మరియు హార్టికల్చర్ సహాయకులు వారి గ్రామం పరిధిలో గల ఈ – పంటను నమోదు చేస్తున్నారు.
- ఇంకా ఎవరైనా రైతులు ఈ – పంటలో నమోదు కానట్లయితే తప్పనిసరిగా సెప్టెంబర్ 30వ తేదీలోగా మీ గ్రామ అధికారులను సంప్రదించి ఈ – పంట లో నమోదు చేసుకోండి..