వాహన మిత్ర పథకం అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే..

వాహన మిత్ర పథకం అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్స్, అప్లై చేయు విధానం వివరాలు ఇవే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రంగ సిద్ధం చేసింది. ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కలిగి ఉన్న వారందరికీ సంవత్సరానికి 15,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేశారు. దసరా పండగ కానుకగా పథకాన్ని అమలు చేయనున్నారు.

గతంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటుగా ఆటో కలిగి వున్న వారు మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అందరికీ దసరా నాటికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here

ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధమైన డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? షెడ్యూల్ ఏ విధంగా ఉంది ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🔥 వాహన మిత్ర పథకం (Vahana Mithra Scheme) ద్వారా ఆటో రిక్షా – మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా – మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయనుంది. ఈ పథకానికి వాహన మిత్ర (Vahana Mithra Scheme) అనే పేరు పెట్టింది.
  • ఈ పథకం అమలుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి గారు అధికారిక ప్రకటన చేశారు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రయాణం కొరకు ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అమలు కావడం వలన రాష్ట్రంలోల ఆటో , క్యాబ్ , టాక్సీ డ్రైవర్లకు జీవనోపాధిలో ఇబ్బందులు ఏర్పడతాయి అన్న కారణంగా వారికి ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

Join Our What’s App Group – Click here

🔥 వాహన మిత్ర (Vahana Mithra Scheme) పథకానికి ఎవరు అర్హులు :

  • ఈ పథకానికి సంబంధించి సొంత వాహనం (ఆటో , టాక్సీ , మ్యాక్సీ క్యాబ్) కలిగి ఉండి డ్రైవర్ అయి ఉండాలి.
  • ఆటో / లైట్ మోటార్ వెహికల్ నడిపేందుకు గాను చెల్లుబాటు అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • వాహనంపై రిజిస్ట్రేషన్ మరియు టాక్స్ పత్రాలు కలిగి వుండాలి.
  • ఈ పథకం కేవలం పాసింజర్ వెహికల్స్ కి మాత్రమే వర్తిస్తుంది , ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వర్తించదు.
  • దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు మరియు రైస్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • ఒక కుటుంబానికి ఒక వాహనంపై మాత్రమే లబ్ధి చేకూరుస్తారు.
  • కుటుంబంలో ఒకరి పేరు న వాహనం రిజిస్టర్ కాబడి , మరొకరి పేరు న డ్రైవింగ్ కలిగి ఉన్నా కూడా పథకానికి అర్హత కలిగి ఉంటారు.

🔥 వాహన మిత్ర పథకం (Vahana Mithra Scheme) కు దరఖాస్తు చేయు విధానం :

  • ఈ పథకానికి సంబంధించి గ్రామా మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారి వద్ద ఉన్న డేటాను , వెరిఫికేషన్ నిమిత్తం సచివాలయ ఉద్యోగులు లాగిన్ కి పంపిస్తారు.
  • కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు గ్రామ మరియు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
  • గ్రామ వార్డు సచివాలయం లో గల డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు నూతన దరఖాస్తులు ను వారి లాగిన్ ద్వారా అప్లై చేస్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు – Click here

🔥 వాహన మిత్ర పథకానికి (Vahana Mithra Scheme) అవసరమయ్యే ధృవపత్రాలు :

  1. దరఖాస్తు ఫారం
  2. ఆధార్ కార్డ్
  3. రేషన్ కార్డ్
  4. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  5. డ్రైవింగ్ లైసెన్స్
  6. కుల ధ్రువీకరణ పత్రం
  7. బ్యాంక్ అకౌంట్ ( NPCI – ఆధార్ కి లింక్ కాబడిన)

🔥 వెరిఫికేషన్ ప్రక్రియ :

  • ఈ పథకానికి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు నూతన దరఖాస్తు చేస్తారు.
  • సంబంధిత దరఖాస్తులను గ్రామ సచివాలయంలో గల సంక్షేమ మరియు విద్యా సహాయకులు , వార్డు సచివాలయంలో డెవలప్మెంట్ సెక్రటరీ వారు వెరిఫికేషన్ చేస్తారు.
  • ఆ తర్వాత సంబంధిత దరఖాస్తులు మండల పరిధిలో అయితే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి వారు , మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ వారు అప్రూవల్ చేయాల్సి వుంటుంది.
  • చివరిగా జిల్లా కలెక్టర్ గారు యొక్క తుది ఆమోదం తర్వాత అర్హులు జాబితాను తయారు చేస్తారు.
  • ఆ తర్వాత అర్హుల జాబితాను విడుదల చేసి , ఆర్థిక సహాయంను విడుదల చేస్తారు.

🔥 వాహన మిత్ర పథకం అమలు కొరకు షెడ్యూల్ విడుదల :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కొరకు అధికారిక షెడ్యూల్ ను విడుదల చేసింది.
  • ఈ కార్యక్రమం అనేది గ్రామ, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా అమలు అవుతుంది.
  • GSWS డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే ఉన్న 2.75 లక్షల డేటాను గ్రామ మరియు వార్డు సచివాలయం కి పంపించు తేదీ : 12/09/2025
  • గ్రామ మరియు వార్డు సచివాలయం లలో నూతన దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేదీ : 17/09/2025
  • గ్రామ మరియు వార్డు సచివాలయంలో నూతల దరఖాస్తుల స్వీకరణ కొరకు చివరి తేదీ : 19/09/2025
  • ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు గాను చివరి తేదీ : 22/09/2025
  • ఫైనల్ అర్హుల జాబితా విడుదల తేదీ : 24/09/2025
  • గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ చేయు తేదీ : 01/10/2025

ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే మీకు మరొక ఆర్టికల్ లో సమాచారాన్ని వివరంగా అందజేయడం జరుగుతుంది.

Related Posts

ఈ తేదిన అన్నదాత సుఖీభవ పథకం 21వ విడత నిధులు జమ
  • adminadmin
  • September 25, 2025

రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో…

Read more

Continue reading
AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
  • adminadmin
  • September 14, 2025

AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *