
ఇండియన్ రైల్వేస్ ! ఎంతోమంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సంస్థ రైల్వేస్ లో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలతో పాటు అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు కూడా ప్రతీ సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల అవుతూ వుంటాయి. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ ( WCR ) వారు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండియన్ రైల్వేస్ లో అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి ఇండియన్ రైల్వే విడుదల చేసే పెర్మనెంట్ నోటిఫికేషన్ లలో ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుగా ఉంటాయి.
వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ (WCR ) లో మొత్తం అన్ని డివిజన్లలో కలిపి 2865 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది. వంటి ఇతర అన్ని అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.
అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాలు సవివరంగా తెలుసుకొని , అర్హత మరియు ఆసక్తి కలిగి ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాన్ని పొందడానికి పునాది వేసుకోండి.
Table of Contents
🔥 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంస్థ కి చెందిన వెస్ట్ సెంట్రల్ రైల్వే సంస్థ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అప్రెంటిస్ యాక్ట్ 1961 క్రింద అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే అప్రెంటిస్ ఉద్యోగాల సంఖ్య :
- వెస్ట్రన్ రైల్వేస్ లో అన్ని డివిజన్లలో కలిపి 2865 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- JBP Division – 1136
- BPL Division – 558
- KOTA Division – 865
- CRWS BPL – 136
- WRS KOTA – 151
- HQ / JBP – 19
🔥అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు అవసరమగు వయస్సు :
- అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి 15 సంవత్సరాలు నిండి 24 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 20/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
🔥 అప్రెంటిస్ ఉద్యోగాలకు అవసరమగు కనీస విద్యార్హత :
- 50% మార్కులతో 10వ తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి మరియు
- NCVT / SCVT ద్వారా గుర్తింపు పొందిన ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ( ITI ) పొంది వుండాలి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నాటికి సంబంధిత విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు , రిజల్ట్ రాణి అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు గల ట్రేడ్ విభాగాలు :
- బ్లాక్ స్మిత్ ( ఫౌండరీ మెన్ )
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రానిక్ మెకానిక్
- ఫిట్టర్
- మిషనిస్ట్
- మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేటర్ )
- మెకానిక్ (మోటార్ వెహికల్ )
- ప్లంబర్
- టర్నర్
- వెల్డర్ ( గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్ )
- వైర్ మెన్
🔥 అప్రెంటిస్ దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి 30/08/2025 నుండి 29/09/2025 వరకు అవకాశం కల్పించారు.
🔥 దరఖాస్తు ఫీజు :
- నీ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే గేదెలు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ , ఎస్టి , దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులు 41 రూపాయల ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- మిగతా అందరు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు గా 141 రూపాయలు చెల్లించాలి.
🔥 దరఖాస్తు చేసుకునేందుకుగాను అవసరమైన ధ్రువపత్రాలు :
- ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు అభ్యర్థి సంతకం
- 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ మరియు మార్క్స్ మెమో
- కుల దృవీకరణ పత్రం ( ఎస్సీ / ఎస్టి / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ )
- దివ్యాంగుల సర్టిఫికెట్ ( అవసరమగు వారు )
- NCVT / SCVT వారి ద్వారా ఇష్యూ చేయబడిన ఐటిఐ సర్టిఫికెట్ మరియు మార్క్స్ మెమో
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అర్హత కలిగిన అభ్యర్థులు యొక్క విద్యార్హత అయిన 10 వ తరగతి మరియు ఐటిఐ మార్కుల సరాసరి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నిర్ణిత మొత్తంలో స్టైఫండ్ లభిస్తుంది.
🔥 హెల్ప్ డెస్క్ :
- ఈ ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కి ఏమైనా సందేహాలు ఉంటే వారి నివృత్తి కొరకు మెయిల్ ఐడి : rjbl2020@gmail.com మరియు ఫోన్ నెంబర్ : 8830326982 కి కార్యాలయ పనివేళలలో ( ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు ) సంప్రదించవచ్చు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేదీ : 20/08/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 30/08/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 29/09/2025
రైల్వే డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ అన్నది భవిష్యత్తులో ఉద్యోగాలకు మంచి ట్రైనింగ్ గా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి రైల్వే విడుదల చేసే వివిధ నోటిఫికేషన్ లలో రిజర్వేషన్ కూడా కల్పిస్తుంది. కావున ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్లో ఉపయోగించుకుంటారని కోరుతున్నాం.