
TGSRTC Driver and Shramiks Recruitment 2025 : తెలంగాణ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సంస్థలో డ్రైవర్లు మరియు శ్రామిక్స్ గా పనిచేసేందుకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబడింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసేందుకు అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏమిటి ? జీతం ఎంత లభిస్తుంది వంటి వివిధ అంశాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ జనాభా లెక్కల సంస్థలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 TGSRTC నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ , హైదరాబాద్ వారి నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 TGSRTC భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థలో పనిచేసేందుకు గాను డ్రైవర్స్ మరియు శ్రామిక్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥TGSRTC భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- డ్రైవర్స్ – 1000
- శ్రామిక్స్ – 743
🔥 TGSRTC డ్రైవర్ మరియు శ్రామిక్స్ అర్హతలు :
- డ్రైవర్లు : 10వ తరగతి లేదా తత్వమాన విద్యార్హత కలిగి ఉండాలి. & చెల్లుబాటు అయ్యే హెవీ పాసింజర్ మోటార్ వెహికల్ ( HPMV) మరియు హెవీ గూడ్స్ వెహికల్ ( HGV ) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ నోటిఫికేషన్ విడుదల తేదీ అయినా 17 /09/2025 కంటే 18 నెలలు కంటే ముందు పొంది ఉండాలి.
- శ్రామిక్స్ : మెకానికల్ ( డీజిల్ / మోటార్ వెహికల్ ) , షీట్ మెటల్ / MVBB / ఫిట్టర్ / ఆటో ఎలక్ట్రీషియన్ / ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కటింగ్ అండ్ స్వీయంగ్ , upholster లేదా మిల్ రైట్ మెకానిక్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి విభాగాలలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- విద్యార్హత నిర్ధారణ కొరకు జూలై 1 , 2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥TGSRTC డ్రైవర్ మరియు శ్రామిక్స్ వయోపరిమితి :
- డ్రైవర్లు : 22 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- శ్రామిక్స్ : 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు వయసుగల అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కటాఫ్ తేదీ గా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు కి 5 సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
🔥తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు విధానము :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
- డ్రైవర్ ఉద్యోగాలకు ఎస్సీ , ఎస్టీ , తెలంగాణ స్థానిక అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా అందరూ అభ్యర్థులు 600 రూపాయలు దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుంది.
- శ్రామిక్స్ ఉద్యోగాలకు ఎస్సీ , ఎస్టీ , తెలంగాణ స్థానిక అభ్యర్థులు 200 రూపాయలు మరియు మిగతా అందరు అభ్యర్థులు 400 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
✅ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 ఎంపిక విధానము :
- డ్రైవర్ : డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను నిర్వహించి ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు 160 cm కంటే అధికంగా ఎత్తు కలిగి వుండాలి.
- ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించినవారు , అదే రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవలసి ఉంటుంది.
- డ్రైవింగ్ టెస్ట్ కొరకు మొత్తం 60 మార్కులు వెయిటేజ్ కేటాయించగా ఇందులో కనీసం 30 మార్కులు పొందినవారు డ్రైవింగ్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుంది.
- విద్య రాతకు మరియు డ్రైవింగ్ లో పని అనుభవానికి 40 మార్కులు వెయిటేజ్ కేటాయించారు.
- శ్రామిక్స్ : ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 100 మార్కులకు గాను సంబంధిత విద్యార్హతలు మార్కులకు 90 శాతం వెయిట్ ఏజ్ కల్పించగా , 10% వెయిటేజ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కు ఇచ్చారు.
🔥 జీతభత్యాలు :
- డ్రైవర్ : ఈ ఉద్యోగాలకు 20,960 నుండి 60,080 రూపాయల వరకు పే స్కేల్ వర్తిస్తుంది.
- శ్రామిక్స్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 16,550 నుండి 45,030 రూపాయల పే స్కేల్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 08/10/2025. (ఉదయం 8 గంటల నుండి)
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 28/10/2025. (సాయంత్రం ఐదు గంటల లోగా)