
NTR Bharosha Pension New Application Latest News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం , కొత్తగా పెన్షన్లు (NTR Bharosha Pension) పొందేందుకు మరియు పెన్షన్ కి సంబంధించి గ్రీవెన్స్ నమోదు కొరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించనుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు కి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అలానే గతంలో ఉన్న పెన్షన్ మొత్తాన్ని పెంచి ఇస్తున్నారు.
దివ్యాంగులు కి నెలకు 6,000/- రూపాయలు మరియు ఇతర పెన్షన్ దారులకు నెలకు 4,000/- రూపాయలు మరియు హెల్త్ పెన్షన్లు కింద 10,000/- రూపాయలు & 15,000/- రూపాయలు అందిస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీ నుండి వాట్సప్ గవర్నెన్స్ (Whatsapp Governance) ద్వారా పెన్షన్ గ్రీవెన్స్ నమోదు కి అవకాశం కల్పించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఎక్స్ ఆఫీసియో కార్యదర్శి వాకాటి కరుణ అధికారికంగా తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ విధంగా దరఖాస్తు /పిర్యాదు నమోదు చేసుకోవాలి ? అవసరమగు ధృవ పత్రాలు ఏమిటి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 “మన మిత్ర పోర్టల్” లో పెన్షన్ గ్రీవెన్స్ కి అవకాశం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా వివిధ సంక్షేమ పథకాల స్టేటస్ ను తెలుసుకొనేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం , ఇప్పుడు కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకొనేందుకు మరియు గ్రీవెన్స్ నమోదు చేసేందుకు అవకాశం కల్పించనుంది.
- ఆగస్టు 15వ తేదీ నుండి పోర్టల్ లో దరఖాస్తు సమర్పించేందుకు గాను అవకాశం ఉంటుంది అని SERP ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ వాకాటి కరుణ తెలిపారు.
✅ AP లో ANM ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
🔥 పెన్షన్ గ్రీవెన్స్ నమోదు చేయు విధానం :
- మన మిత్ర వాట్సాప్ (95523 00009) సర్వీస్ లో కొత్తగా ” New pension Grievance ” అనే ఆప్షన్ ను ఇవ్వడం జరుగుతుంది.
- పెన్షన్ కి సంబంధించి కొత్త దరఖాస్తు నమోదు కొరకు లేదా ఇప్పటికే పెన్షన్ మంజూరు అయి శాంక్షన్ కానివారికి , ఇతర పిర్యాదులు కి గ్రీవెన్స్ నమోదు కొరకు కొత్తగా ఆప్షన్ ప్రొవైడ్ చేయనున్నారు.
- దరఖాస్తుదారులు వారి వివరాలు ను నమోదు చేయవలసి వుంటుంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధార్ అప్డేట్ హిస్టరీ వంటివి అవసరం అగును.
- ముందుగా ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి , ప్రీ పాపులేటెడ్ గా వచ్చే వివరాలు పేరు , భర్త / తండ్రి పేరు , వయస్సు వంటివి చెక్ చేసుకోవాలి. (House hold mapping ఆధారంగా వివరాలు డిస్ప్లే అవుతాయి)
- తర్వాత ఏ రకమైన పెన్షన్ కి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ వివరాలు నమోదు చేయవలసి వుంటుంది. (OAP/ WIDOW/ Single women/ Disable / ఇతర)
- అలానే గ్రీవెన్స్ నమోదు చేయాలి అంటే సంబంధిత ధ్రువపత్రాలు కూడా అప్లోడ్ చేయవలసి వుంటుంది.
🔥 గ్రీవెన్స్ పరిష్కరించే విధానం :
- పౌరులు / దరఖాస్తులు నమోదు చేసుకున్న గ్రీవెన్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ వెబ్సైట్ అయిన social security pension portal (SSP portal) లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) గారి లాగిన్ నందు ఎనేబుల్ అవుతుంది.
- రాష్ట్రంలో అమలవుతున్న PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సెల్ సిస్టమ్) మాదిరి గా ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా నమోదు చేసిన గ్రీవెన్స్ లు కూడా రెడ్రస్సెల్ చేస్తారు.
- ఫిర్యాదు ను పరిష్కరించే విధానం లో అధికారులు సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి , గ్రీవెన్స్ రెడ్రస్సెల్ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు కూడా జత చేస్తారు.
- ఫిర్యాదు పరిష్కరణ కొరకు అధికారులు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ పౌరులకు వాట్సప్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
- అలానే ఫిర్యాదు స్టేటస్ అనగా ఫిర్యాదు అనేది ఎక్కడ ఉంది, అధికారి వెరిఫై చేశారా లేదా వంటి అంశాలు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఇస్తారు. (Public can also view the status of Grievance)
🔥 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేసే అవకాశం ద్వారా కలిగే ప్రయోజనాలు :
- దరఖాస్తుదారులు కి ఈ అవకాశం కల్పించడం ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. వారికి చాలా సులభంగా గ్రీవెన్స్ నమోదుకు అవకాశం ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ NTR భరోసా పెన్షన్ సమస్యలు అతి త్వరగా పరిష్కరించబడతాయి.
- ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల అమలు లో పారదర్శకత పెరుగుతుంది.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివిధ సంక్షేమ పథకాలు & విద్యా , ఉపాధి అవకాశాలు మరియు ఇతర వివిధ అంశాల పై అవగాహన కల్పించడం కొరకు ఏర్పాటు చేసిన ఈ పేజీ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు చదివిన ఈ ఆర్టికల్ ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయగలరు.