
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో గల పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీ మరియు షెడ్యూల్ – బి మినీ రత్న క్యాటగిరి – 1 కంపెనీ అయిన గోవా షిఫ్ట్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ కొరకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలను సాధించిన వారికి ప్రారంభం లోనే సుమారుగా ఒక లక్ష రూపాయలు జీతం లభిస్తుంది.
మేనేజ్మెంట్ ట్రైన్ గా ఎంపికైన వారు ట్రైనింగ్ పీరియడ్ అనంతరం అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ కి పదోన్నతి పొందుతారు.
ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఎటువంటి విద్యార్హతలు కలిగి ఉండాలి ? దరఖాస్తు చేయు విధానం ఏమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? మరియు నోటిఫికేషన్ యొక్క సమగ్ర విశ్లేషణ కొరకు ఈ ఆర్టికల్ నుంచి ఎవరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ ఈ ఉద్యోగం నోటిఫికేషన్ను విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల సంఖ్య :
- అన్ని విభాగాలలో కలిపి మొత్తం 32 మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా విభాగాల వారీగా ఖాళీల సంఖ్య ఈ విధంగా ఉంది.
- మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) – 09
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) – 05
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) – 02
- మేనేజ్మెంట్ ట్రైనీ (నావెల్ ఆర్కిటెక్చర్) – 12
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్షియల్) – 02
- మేనేజ్మెంట్ ట్రైనీ (రోబోటిక్స్) – 02
🔥 మేనేజ్మెంట్ ట్రైన్ ఉద్యోగాలకు అవసరమగు వయస్సు :
- మేనేజ్మెంట్ ట్రైన్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి కేటగిరీలు వారీగా ఈ విధంగా ఉంది.
- 33 సంవత్సరాల లోపు గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు , 31 సంవత్సరాలు లోపు గల ఓబీసీ అభ్యర్థులు , 28 సంవత్సరాల లోపు గల జనరల్ (UR) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 మేనేజ్మెంట్ ట్రైనీ – విద్యార్హత :
- మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్ ) : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి మెకానికల్ విభాగంలో 60% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E) / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.tech) ఉత్తీర్ణత సాధించాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ) : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ విభాగంలో 60% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E) / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.tech) ఉత్తీర్ణత సాధించాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E) / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.tech) ఉత్తీర్ణత సాధించాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (నావెల్ ఆర్కిటెక్చర్) : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో 60% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E) / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.tech) ఉత్తీర్ణత సాధించాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్షియల్) : గ్రాడ్యుయేట్ అయి ఉండి , CA / ICMA క్వాలిఫై అయి ఉండాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (రోబోటిక్స్) : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి రోబోటిక్స్ విభాగంలో 60% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E) / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.tech) ఉత్తీర్ణత సాధించాలి.
ఇంజనీరింగ్ విభాగంలో గల విద్యార్హతలకు సంబంధించి సాంకేతిక విభాగాలు ఈ విధంగా ఉన్నాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్ చేస్తున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత కి సంబంధించి చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు , అయితే ఉద్యోగంలో జాయిన్ అయిన తేదీ నాటికి ఉత్తీర్ణత సాధించి , సర్టిఫికెట్ పొంది వుండాలి.
🔥 దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 500/- రూపాయలు దరఖాస్తు ఫీజును (SBI e pay – debit card/ credit card/ net banking etc) ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఫీజు మినహాయింపు కలదు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష (Computer Based Test / Pen Based Test) నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఇందులో భాగంగా మొత్తం 85 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత విభాగానికి చెందిన ప్రశ్నలు 60 మరియు జనరల్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 25 ప్రశ్నలు ఉంటాయి.
- ఈ పరీక్షకు ఒక గంట సమయాన్ని కాలపరిమితిగా నిర్ణయించారు. ఇది ఆబ్జెక్టు ఆధారిత మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు గల పరీక్ష.
- రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ట్రైన్ పీరియడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీ గా 40,000/- బేసిక్ పే తో పాటుగా వివిధ అలోవెన్స్ లు లభిస్తాయి. సంవత్సరానికి 11.65 లక్షల జీతం లభిస్తుంది.
- తర్వాత కాలంలో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ వచ్చిన తర్వాత వీరికి సంవత్సరానికి 15.40 లక్షల జీతం లభిస్తుంది.