
Free three wheeler vehicles for the disabled : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల దివ్యాంగుల సంక్షేమం కొరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దివ్యాంగులకు వారి కేటగిరి ఆధారంగా పెన్షన్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటార్ వెహికల్స్ అందించేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు , సీనియర్ సిటిజన్ సహకార సంస్థ (APDASCAC) రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు మోటార్ వెహికల్స్ అందించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ మూడు చక్రాల మోటార్ వెహికల్స్ పొందేందుకు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు ? అవసరమయ్యే ధ్రువపత్రాలు ఏమిటి ? ఏ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 దివ్యాంగులకు ఉచితంగా మోటార్ వెహికల్స్ (Free three wheeler vehicles for the disabled) :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటార్ వెహికల్స్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- చదువుకున్న / చదువుకుంటున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
- గతంలో మోటార్ వెహికల్స్ కోసం దరఖాస్తు చేసుకొని , అప్పుడు వెహికల్ మంజూరు కాని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
✅ Join Our What’sApp Group – Click here
🔥మూడు చక్రాల వాహనం పొందేందుకు అర్హతలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగి ఉండి , 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాల వయస్సు లోపు కలిగి 70 శాతం కి పైగా వైకల్యం కలిగిన వారు ఈ మోటార్ వెహికల్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.
- దరఖాస్తు దారుల యొక్క ఎంపిక జరిపే తేదీ నాటికి కనీసం రెండు నెలల ముందు గా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
- దరఖాస్తు దారానికి ఎటువంటి సొంత వాహనం ఉండరాదు.
- రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతంలో ఉచితంగా మూడు చక్రాల వాహనం ను పొంది ఉండరాదు అయితే గతంలో దరఖాస్తు చేసుకొని వాహనం పొందని వారు మాత్రం మరలా దరఖాస్తు సమర్పించవచ్చు.
🔥దరఖాస్తు చేయు విధానం :
- ఎవరైనా ఈ మూడు చక్రాల వాహనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వారికి ఆన్లైన్ విధానం ద్వారా APDASCAC వారి అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
🔥 దరఖాస్తు చేసుకొనేందుకు అవసరమగు ధ్రువపత్రాలు :
- ఆధార్ కార్డు
- పదవ తరగతి సర్టిఫికేట్
- కుల ధ్రువీకరణ పత్రం ( SC మరియు ST వారికి)
- సదరం సర్టిఫికెట్
- పూర్తి ఫోటో ( పాస్ పోర్ట్ సైజ్ లో )
- ఇటీవల ఆదాయ ధ్రువీకరణ పత్రం
- దరఖాస్తు దారుడు విద్యార్థి అయితే సంబంధిత కాలేజ్ వారి నుండి బానిఫైడ్ సర్టిఫికెట్
- సెల్ఫ్ డిక్లరేషన్ ( గతంలో ఈ పథకం ద్వారా లబ్ది పొందలేదు మరియు వివరాలు అన్ని సరైనవి అని ధృవీకరిస్తూ)
🔥ఎంపిక విధానం :
- మూడు చక్రాల వాహనం పోయేందుకు గాను ఎంపిక చేసే అంశంలో PG విద్యార్థులకు మరియు డిగ్రీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
- అలానే పంపిణీ చేసే మొత్తం త్రి చక్ర వాహనాలలో మహిళలకు 50 శాతం మరియు పురుషులకు 50 శాతంగా నిర్ణయించారు.
- రిజర్వేషన్లు ఆధారంగా ఎస్సీ వారికి 16 శాతం & ఎస్టి వారికి 7 శాతం , మిగతా అందరు కేటగిరి వారికి 77 శాతం గా కేటాయిస్తారు.
🔥ముఖ్యమైన తేదీ :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది..