APPSC AEE Notification 2025 | Qualification, Age, Salary, Selection Process, Apply Process

APPSC AEE Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో పనిచేసేందుకు గాను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) (AEE – CIVIL) ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏమిటి ? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? వంటి వివిధ అంశాల పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

AP ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉద్యోగాలు – Click here

🔥 APPSC AEE నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)సంస్థ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 APPSC AEE నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • రూరల్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE – CIVIL) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేయబోయే మొత్తం APPSC AEE ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

RTC లో 1743 ఉద్యోగాలు – Click here

🔥APPSC AEE అవసరమగు వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు గల అభ్యర్థులుకు అవకాశం ఉంటుంది.
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ , డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.

🔥APPSC AEE Qualification (విద్యార్హత వివరాలు):

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. (లేదా)
  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ సివిల్ సంస్థ వారు నిర్వహించే AMIE పరీక్ష సెక్షన్ – A మరియు section – B నందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

🔥 దరఖాస్తు విధానం :

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు 250/- రూపాయలు దరఖాస్తు ఫీజుతో పాటుగా 120/- రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టి , బీసీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్మెన్ , రేషన్ కార్డు కలిగి ఉన్నవారు , నిరుద్యోగులు వారికి 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులని ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా విధానం :

  • ఆబ్జెక్టివ్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • ఇందులో భాగంగా మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ కు 150 ప్రశ్నలు కి 150 మార్కులు కేటాయించారు. ఒక్కొక్క పేపర్ కి 150 నిముషాల సమయం ఇస్తారు.
  • మొత్తం 450 మార్కులు కి అభ్యర్థుల పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్పుల విధానం కలదు.
  • పేపర్ – 01 : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ
  • పేపర్ – 02 : సివిల్ & మెకానికల్ ఇంజనీరింగ్ (కామన్)
  • పేపర్ – 03 : సివిల్ ఇంజనీరింగ్

🔥 పరీక్ష కేంద్రాలు :

  • వ్రాత పరీక్షను జ్ఞాపకం విజయవాడలో మాత్రమే నిర్వహిస్తారు.

🔥 జీత భత్యాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 57,100/- నుండి 1,47,760/- రూపాయల బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి..

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 18/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08/10/2025

👉 Click here for notification

👉 Click here to apply

Related Posts

APPSC CIVIL Draughtsman Grade-2 (Technical Assistant) Notification 2025
  • adminadmin
  • September 16, 2025

APPSC CIVIL Draughtsman Grade-2 Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ – II (టెక్నికల్ అసిస్టెంట్) ఉద్యోగాల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్…

Read more

Continue reading
AP Medical College Jobs Notification 2025 | AP Contract / Outsourcing Jobs
  • adminadmin
  • September 13, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గుంటూరు జిల్లా లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు గల NATCO క్యాన్సర్ కేర్ సెంటర్ , గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ , మెడికల్ కాలేజ్…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *