
Andhrapradesh Government Fee Reimbursement Scheme : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బి.టెక్, డిగ్రీ , ఐటిఐ, డిప్లొమా , పీజీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు గమనిక ! ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
2025 – 26 విద్యా సంవత్సరం తో పాటు 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ మీ గ్రామ, వార్డు సచివాలయం లలో జరుగుతుంది.
ఈ అంశానికి సంబంధించి విద్యార్థుల పేర్లు వెరిఫికేషన్ కొరకు వచ్చాయా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి ? వెరిఫికేషన్ కొరకు అవసరమగు ధృవ పత్రాలు ఏమిటి ? సచివాలయం లో వెరిఫికేషన్ కి రాకపోతే ఏం చేయాలి అన్న విషయాలు ను ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.
Table of Contents
🔥 ఆంధ్రప్రదేశ్ ఫీజు రీయింబర్మెంట్ పథకం (RTF & MTF) :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమ పథకాల్లో భాగంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
- ఈ పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటుగా ఇతర హాస్టల్ ఖర్చులకు కూడా నగదు ను ఇస్తుంది.
🔥 Fee Reimbursement Scheme కు ఎవరు అర్హులు :
- ప్రభుత్వ / ఎయిడెడ్ / ప్రైవేట్ కళాశాలలు , రాష్ట్ర బోర్డు కి అఫిలేటెడ్ గా ఉన్న యూనివర్సిటీ లలో పాలిటెక్నిక్ , ఐటిఐ , డిగ్రీ మరియు ఇతర ఉన్నత కోర్సులను అభ్యసిస్తున్న వారు అర్హులు అవుతారు.
- డే స్కాలర్ విద్యార్థులు , కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు , డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ లలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు. మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఈ పథకానికి అర్హులు కారు.
- విద్యార్థి యొక్క హాజరు శాతం 75% కంటే అధికంగా ఉండాలి.
✅ తల్లికి వందనం పథకం కొత్త జాబితా విడుదల చేశారు – Click here
🔥 Fee Reimbursement Scheme కు ఎవరు అనర్హులు :
- ప్రైవేట్ యూనివర్సిటీ లు / డీమ్డ్ యూనివర్సిటీ లలో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.
- కరెస్పాండెన్ / డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సు లలో చదువుతున్న వారు ఈ పథకం క్రింద లబ్ది పొందలేరు.
- మేనేజ్మెంట్ / స్పాట్ కోటా క్రింద అడ్మిట్ అయిన విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.
🔥అవసరమగు అర్హత ప్రమాణాలు (Required eligibility criteria for Fee Reimbursement Scheme) :
- ఈ పథకానికి అర్హత పొందేందుకు గాను కుటుంబ ఆదాయ పరిమితి సంవత్సరానికి 2.50 లక్షల కంటే తక్కువ గా వుండాలి.
- కుటుంబానికి సంబంధించి పూర్తి భూ పరిమితి మాగాణి అయితే 10 ఎకరాల లోపు & మెట్ట భూమి అయితే 25 ఎకరాల లోపు & మెట్ట మరియు మాగాణి రెండు కలిపి 25 ఎకరాల లోపు కలిగి వుండాలి.
- కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి / ప్రభుత్వ పెన్షన్ దారు ఉండరాదు. పారిశుధ్య కార్మికులు కి మినహాయింపు కలదు.
- కుటుంబానికి ఎటువంటి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. (టాక్సీలు / ట్రాక్టర్లు /ఆటోలు కి మినహాయింపు కలదు.)
- కుటుంబానికి 1500 చదరపు అడుగులు కంటే తక్కువ మున్సిపల్ ప్రాపర్టీ ( రెసిడెన్షియల్ / కమర్షియల్ ) కలిగి వుండాలి.
- కుటుంబం లో ఎవరూ ఆదాయ పన్ను చెల్లింపు దారులు ఉండరాదు.
✅ పదో తరగతి అర్హతతో 4987 ఉద్యోగాలు – Click here
🔥దరఖాస్తు విధానం (How to Apply AP Fee Reimbursement Scheme) :
- విద్యార్థులు ముందుగా వారు చదువుతున్న కాలేజీ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
- దరఖాస్తు ఫారం ను జ్ఞానభూమి వెబ్సైట్ నుండి లేదా కాలేజ్ నుండి పొందవచ్చు.
- సంబంధిత దరఖాస్తు ను ఫిల్ చేసి , కాలేజ్ వారికి అందజేయాలి.
- కాలేజ్ యాజమాన్యం దరాఖస్తును వెరిఫై చేసి , దరఖాస్తును అధికారిక పోర్టల్ నందు సబ్మిట్ చేస్తారు.
🔥వెరిఫికేషన్ ప్రక్రియ :
- కాలేజ్ నుండి నమోదు కాబడిన దరఖాస్తు , అర్హత ప్రమాణాలు వెరిఫికేషన్ కొరకు సంబంధిత గ్రామ , వార్డు సచివాలయం లాగిన్ కి పంపించబడుతుంది.
- సంబంధిత గ్రామ వార్డు సచివాలయం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ / వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ స్టూడెంట్ యొక్క వివరాలను వెరిఫై చేస్తారు.
🔥 వెరిఫికేషన్ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు (Required Documents for Fee Reimbursement) :
- 1.కుటుంబం యొక్క ఆధార్ కార్డులు
- 2.రైస్ కార్డ్
- 3. విద్యార్థి తల్లి మరియు స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్ (SC విద్యార్థులు అయితే తల్లి ఆధార్ కి లింక్ కాబడిన అకౌంట్)
- 4.కుల ధ్రువీకరణ పత్రం
- 5.ఆదాయ ధ్రువీకరణ పత్రం
సంబంధిత ధ్రువపత్రాలు ను తీసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ను వెరిఫై చేయించుకోవాలి.
🔥 ప్రారంభం అయిన ఫీజు రీయింబర్స్మెంట్ (RTF & MTF) వెరిఫికేషన్ ప్రక్రియ :
- 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి రీయింబర్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ (RTF) సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయవలసిన విద్యార్థులు జాబితాను జ్ఞానభూమి పోర్టల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ నందు పొందుపరచడం జరిగింది.
- 2025 – 26 విద్యా సంవత్సరంతో పాటుగా 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ విద్యార్థుల సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ ను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
- విద్యార్థులు యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి వీలైనంత త్వరగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగలరు.
🔥పథకం ద్వారా చేకూరే లబ్ది :
- ఈ పథకానికి సంబంధించి RTF ద్వారా అర్హత కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కాలేజీ ఫీజును రియంబర్స్ చేస్తుంది.
- అలానే MTF పథకం ద్వారా డిగ్రీ మరియు ఉన్నత చదువులు చదువుతున్న వారికి సంవత్సరానికి 20,000/- రూపాయలు & డిప్లొమా / పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000/- రూపాయలు & ఐటిఐ విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున అందిస్తుంది.
ఈ సంవత్సరం కొత్తగా కోర్సు లో జాయిన్ అయిన వారి (1st year) తో పాటుగా గతంలో జాయిన్ అయి కోర్సు లో ఇతర తరగతులు (2nd year & 3rd year & final year) కూడా దరఖాస్తును వెరిఫై చేసుకొని , రెన్యువల్ చేసుకోవాలి.