
APDASCAC ద్వారా ఉచితంగా టచ్ మొబైల్స్ : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పెన్షన్లు , స్కాలర్షిప్ లు మరియు వారికి అవసరమగు ఉపకరణాలు వంటివి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి.
అయితే దివ్యాంగులకు ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు పై వారికి సరైన అవగాహన లేకపోవడం తో ఈ సంక్షేమ పథకాల అందడం లేదు.
ప్రభుత్వాలు మరియు అధికారులు ఈ సంక్షేమ పథకాలను అందించాలని , సంబంధిత వివరాలను పత్రిక ప్రకటలను ద్వారా , అధికారిక ఉత్తర్వులు ద్వారా తెలియచేస్తూనే ఉన్నారు.
అర్హత కలిగిన దివ్యాంగులకు మరియు విద్యార్థులకు లబ్ది చేకూరే స్కాలర్షిప్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అలానే బధురులు కి ఉచిత మొబైల్ ఫోన్లు ఏ విధంగా పొందవచ్చు. వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 విభిన్న ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు :
- దేశంలో గల విభిన్న ప్రతిభావంతులు అయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది.
- విభిన్న ప్రతిభావంతులు అయిన విద్యార్థులకు 2025 – 26 విద్యా సంవత్సరం కి సంబంధించి ఉపకార వేతనాలు ( స్కాలర్షిప్ ) అందించనున్నట్లు దివ్యాంగులు , వయో వృద్ధుల శాఖ ప్రకటించింది.
- ఇందుకొరకు 9 వ తరగతి , 10 వ తరగతి , ఇంటర్ , డిప్లొమా , పీజీ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
✅ పెన్షన్ రద్దు అయిన వారికి గుడ్ న్యూస్ – Click here
🔥 స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేయు విధానం :
- విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దీనికోసం ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ OTR) చేసుకోవాలి.
- ఆ తర్వాత సంబంధిత వివరాలు నమోదుచేసి స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 స్కాలర్షిప్ అప్లై చేయడానికి చివరి తేదీ :
- 9 వ తరగతి మరియు 10 వ తరగతి విద్యార్థులు ఆగస్టు 31 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
- మిగతా అందరు విద్యార్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉంది.
🔥 బధిరులకు ఉచితంగా మొబైల్ టచ్ ఫోన్లు :
- బధిరులకు (మూగ మరియు చెవిటి) మొబైల్ టచ్ ఫోన్ లను ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏ.డి వి.కామరాజు ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపారు.
🔥 టచ్ ఫోన్లు పొందేందుకు ఎవరు అర్హులు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసం వుండాలి.
- 18 సంవత్సరాల వయస్సు నుండి యుండాలి.
- కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సైగల భాష కచ్చితంగా వచ్చి వుండాలి.
- కనీసం 40 శాతం వైకల్యం కలిగి వుండాలి.
- కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు :
- ఆధార్ కార్డ్
- సదరం సర్టిఫికెట్
- 10 వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
- ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
- సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులు)
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- ఇన్కమ్ సర్టిఫికెట్
- రైస్ కార్డ్
🔥APDASCAC వెబ్సైట్ లో దరఖాస్తు చేయు విధానం :
- టచ్ ఫోన్లు కొరకు దరఖాస్తు చేయు అభ్యర్థులు https://www.apdascac.ap.gov.in అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు యొక్క ప్రాధమిక వివరాలు పూర్తి పేరు , తండ్రి పేరు , డేట్ ఆఫ్ బర్త్ , జెండర్ , కులం , ఫోన్ నెంబర్ , ఆధార్ నెంబర్ , జిల్లా మరియు పూర్తి చిరునామా ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత సదరం సర్టిఫికెట్ , ఆధార్ కార్డు , 10 వ తరగతి సర్టిఫికేట్ , సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ , ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ , కాస్ట్ సర్టిఫికెట్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , రేషన్ కార్డ్ / ఇన్కమ్ సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయాలి.
- పైన పేర్కొన్న సర్టిఫికెట్ లు విడి విడిగా ఒక్కొక్కటి , 2 MB కంటే తక్కువ గా ఉండేలా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.