
AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఇటీవల ప్రకటించారు. గత ప్రభుత్వము ఇలాంటి పథకాన్ని వాహన మిత్ర అనే పేరుతో అమలు చేసింది.
✅ ప్రతిరోజు ఇలాంటి వివిధ పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. మీ నెంబర్ ఎవరికీ కనిపించదు.
🏹 Join Our What’sApp Group – Click here
ఇందులో భాగంగా 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను అధికారిక జీవో విడుదల అయింది. సెప్టెంబర్ 13, 2025 నాడు ట్రాన్స్పోర్ట్ , రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుండి G.O.Ms.No.33 ద్వారా ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏమిటి ? దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది ? షెడ్యూల్ ? పథకం ఏ విధంగా అమలు చేస్తారు ? వంటి అన్ని అంశాలను తెలియజేశారు.
పైన పేర్కొన్న అన్ని అంశాల సమగ్ర విశ్లేషణ కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ AP NIT లో ఉద్యోగాలు భర్తీ – Click here
Table of Contents :
🔥 వీరందరికీ వాహన మిత్ర డబ్బులు15,000/- జమ (AP Vahana Mithra Scheme Money 15,000/-) :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆటో , టాక్సీ , మోటర్ క్యాబ్ , మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి 15000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయనుంది.
- రాష్ట్ర ప్రభుత్వం వాహనాల ఇన్సూరెన్స్ , ఫిట్నెస్ సర్టిఫికేట్ , మరమ్మత్తులు చేసుకునేందుకు మరియు ఇతరత్రా అవసరాల ఖర్చుల కొరకు ఈ ఆర్థిక లబ్ధి చేకూర్చనున్నారు.
- గ్రామ వార్డ్ సచివాలయ శాఖ మరియు రవాణా శాఖ ఈ పథకానికి సంబంధించి అమలు చేసేందుకు గాను తదుపరి చర్యలు తీసుకున్నారు.
🔥వాహన మిత్ర పథకం అర్హతలు (Vahana Mitra Scheme Eligibility) :
ఈ క్రింది అర్హతలు ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.
- సొంతంగా ఆటోరిక్షా / మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ కలిగి డ్రైవర్ చేస్తూ వుండాలి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాహనం రిజిస్టర్ అయ్యి , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , ఫిట్నెస్ మరియు టాక్స్ సర్టిఫికెట్ కలిగి వుండాలి. ఆటో వారికి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఫిట్నెస్ సర్టిఫికేట్ నుండి మినహాయింపు ఇచ్చారు.(ఆటో దారులు ఒక నెలలోగా వాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయించుకోవాలి)
- ఆధార్ కార్డు కలిగి వుండాలి.
- వైట్ రేషన్ కార్డ్ కలిగి వుండాలి.
- ఒక కుటుంబానీకి ఒక లబ్ది మాత్రమే ఇస్తారు.
- ఒకే కుటుంబంలో వేరు వేరుగా వాహన రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నా సరే ఈ పథకానికి అర్హులే.
- వాహనం తప్పనిసరిగా యజమాని అధీనంలో ఉండాలి.
- వృత్తికి సంబంధించి ఎటువంటి పథకాలలో లబ్ది పొంది ఉండకూడదు.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి / పెన్షనర్ ఉండరాదు. (శానిటేషన్ ఉద్యోగులకు మినహాయింపు కలదు)
- కుటుంబంలో ఎవరు ఆదాయపు పన్ను చెల్లింపు దారులు ఉండరాదు.
- ఒక నెల విద్యుత్ వినియోగం 300 యూనిట్లు లోపు ఉండాలి. (12 నెలల సరాసరి లెక్కిస్తారు)
- 3 ఎకరాల లోపు మాగాణి , 10 ఎకరాల లోపు మెట్ట భూమి కలిగి వుండాలి.
- మున్సిపాలిటీ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల లోపు రెసిడెన్షియల్ / కమర్షియల్ ఏరియా ఉండాలి.
- ప్రభుత్వ సంస్థలకు , ఇతర సంస్థలకు లీజు కి ఇచ్చిన వాహనాలు ఈ పథకానికి అర్హత కలిగి ఉండవు.
- వాహనం పై ఎటువంటి పెండింగ్ బకాయిలు , చలానాలు ఉండరాదు.
🔥 వాహన మిత్ర పథకం దరఖాస్తు ప్రక్రియ (Vahana Mithra Scheme Application Process) :
- నూతనంగా దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ , వార్డు సచివాలయం ల ద్వారా అవకాశం కల్పిస్తారు.
- కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారికి సెప్టెంబర్ 17 వ తేదీ నుండి సెప్టెంబర్ 19 వ తేదీ లోపుగా గ్రామ వార్డు సచివాలయం లో అవకాశం కల్పించారు.
🔥 వాహన మిత్ర పథకానికి అవసరమగు ధ్రువపత్రాలు (Documents required for Vahana Mitra Scheme) :
- కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మరియు వెరిఫికేషన్ కొరకు లబ్ధిదారులు ఈ క్రింది ధ్రువపత్రాలు కలిగి వుండాలి.
- దరఖాస్తు ఫారం
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- డ్రైవింగ్ లైసెన్స్
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- ఫిట్నెస్ సర్టిఫికేట్
- టాక్స్ కాపీలు
- ఇతర దృవపత్రాలు ఏమైనా
✅ RBI లో ఉద్యోగాలు – Click here
🔥 వెరిఫికేషన్ ప్రక్రియ :
- ఈ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ను 22/09/2025 లోగా పూర్తి చేస్తారు.
- ముందుగా గ్రామ, వార్డు సచివాలయంలో గల వెల్ఫేర్ అసిస్టెంట్ లు దరఖాస్తు యొక్క అర్హతను నిర్ధారించి , సంబంధిత MPDO / మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు.
- సంబంధిత అప్లికేషన్లు MPDO / మున్సిపల్ కమిషనర్ వారు అప్రూవల్ / రిజెక్షన్ కొరకు జిల్లా కలెక్టర్ వారి కి ఆన్లైన్ విధానం లోనే ఫార్వర్డ్ చేస్తారు.
- దరఖాస్తు దారుల యొక్క అర్హతల ఆధారంగా & పథకం యొక్క విధివిధానాల ఆధారంగా లబ్ధిదారులకు పథకం మంజూరు అవుతుంది.
🔥 పేమెంట్ చేయు విధానం :
- ఈ పథకానికి అర్హత కలిగిన వారికి కార్పొరేషన్లు ఆధారంగా నగదు జమ అవుతుంది.
- ముందుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ వారు ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ , బడ్జెట్ శాంక్షన్ కోసం ప్రపోజల్ పెడతారు.
- మంజూరు అయిన తర్వాత కార్పొరేషన్లు యొక్క పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ ద్వారా GSWS డిపార్ట్మెంట్ వారు ఇచ్చే అర్హుల జాబితా ప్రాప్తికి లబ్ధిదారులకు వారి వ్యక్తిగత ఖాతాలలో నగదు జమ చేస్తారు.
- ఈ క్రింది కార్పొరేషన్ల ద్వారా నగదు వ్యక్తిగత ఖాతాలలో జమ చేస్తారు.

🔥 పథకం అమలు చేసేందుకు గాను విడుదల చేసిన టైమ్ లైన్స్ :
- 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్న డేటా ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేందుకు వీలుగా డేటా అందుబాటులో ఉంచు తేదీ : 13/09/2025
- నూతనంగా దరఖాస్తులు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించే తేదీ : 17/09/2025
- నూతనంగా దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ : 19/09/2025
- సచివాలయ స్థాయి , మండల స్థాయి , జిల్లాస్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేయుటకు చివరి తేదీ : 22/09/2025
- అర్హుల జాబితాను విడుదల చేయు తేదీ : 24/09/2025
- గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా నగదు జమ చేయు తేదీ : 01/09/2025