AP Smart Ration Cards Latest News | Smart Ration Cards Errors Correction Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు (SMART RATION CARDS) పంపిణీ కొనసాగుతోంది. ఆగస్టు నెల 25వ తేదీ నుండి ప్రారంభమైన ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ల పంపిణీ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది అని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.

మంత్రిగారు స్మార్ట్ కార్డుల పంపిణీ , రేషన్ పంపిణీ తోపాటు వివిధ అంశాలకు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు.

రాష్ట్రంలో మరో కొత్త పథకం , దసరా రోజున 15,000/- జమ – Click here

🔥 కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ (Ongoing distribution of smart ration cards) :

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది.
  • ఇప్పటివరకు మొత్తం 80 శాతం లబ్ధిదారులకు రేషన్ కార్డ్లు పంపిణీ చేయబడ్డాయి.
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది అని మంత్రి గారు చెప్పారు.
  • మొత్తం నాలుగు విడతల గా ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేశారు.
  • ఇప్పటికే ప్రతి రేషన్ షాపునకు ఒక సచివాలయం ఉద్యోగిని మ్యాప్ చేశారు. వారు ఇంటింటికి రేషన్ కార్డ్ లను పంపిణీ చేస్తున్నారు.
  • గతంలో విడుదల అయిన ఆదేశాల మేరకు రేషన్ కార్డ్లు పంపిణీ ప్రారంభం అయిన 5 రోజులు పాటు సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.
  • ఆ తర్వాత మిగిలిపోయిన రేషన్ కార్డులను సంబంధిత రేషన్ షాప్ డీలర్ పంపిణీ చేస్తారు.

🔥 రాష్ట్రంలో గల ప్రతి రేషన్ షాప్ నుండి రేషన్ పంపిణీ :

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29762 రేషన్ షాప్ ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నాం అని మంత్రి గారు తెలిపారు.
  • రేషన్ డీలర్లు వారి పరిధిలోగల రేషన్ పంపిణీ చేస్తారని , దీనితో పాటుగా పౌరులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే అవకాశం కల్పించామని , ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here

🔥 స్మార్ట్ రేషన్ కార్డులులో తప్పులను ఉచితంగా సరి చేసుకోండి (Correct errors in smart ration cards for free:

  • రాష్ట్రంలో పంపిణీ చేయబడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏమైనా నమోదు అయితే ప్రజలు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి సరి చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పారు.
  • స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు నమోదయి ఉంటే ( పేర్లు , చిరునామా , సంబంధం మొదలగునవి ) వివరాలతో గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని సంప్రదించి తప్పులను సరి చేసేందుకు గాను దరఖాస్తులను నమోదు చేయవచ్చు.
  • తప్పులను సరిదిద్దేందుకు గాను ఎవరు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదని , అక్టోబర్ 31 లోపు ఉచితంగా తప్పులను సరిదిద్దుకోవచ్చని మంత్రిగారు తెలిపారు.
  • అక్టోబర్ 31 లోపు తప్పులను సరిదిద్దుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉచితంగా (free of charge) మళ్ళీ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
  • Related Posts

    కౌశలం సర్వే, వాహన మిత్ర, తల్లికి వందనం, స్మార్ట్ రేషన్ కార్డ్స్ పథకాల లేటెస్ట్ న్యూస్
    • adminadmin
    • September 15, 2025

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహించి , సంక్షేమ పథకాల అమలు కచ్చితంగా జరుగుతుంది అని మరొక సారి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి…

    Read more

    Continue reading
    AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
    • adminadmin
    • September 14, 2025

    AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

    Read more

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *