
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గుంటూరు జిల్లా లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు గల NATCO క్యాన్సర్ కేర్ సెంటర్ , గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ , మెడికల్ కాలేజ్ నందు కాంట్రాక్ట్ ప్రాధిపాధికత / ఔట్సోర్సింగ్ ప్రాతిపదికతన పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు రెండు నోటిఫికేషన్ లు విడుదల అయ్యాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? దరఖాస్తు చేసుకోవడానికి అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? వంటి ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 67 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- రేడియో థెరపీ టెక్నీషియన్
- పర్సనల్ అసిస్టెంట్
- ఓటి అసిస్టెంట్
- మోల్డ్ రూమ్ టెక్నీషియన్
- ఎనస్తీసియా టెక్నీషియన్
- రేడియోగ్రాఫర్
- ఆడియోమెట్రి టెక్నీషియన్
- ECG టెక్నీషియన్
- EEG టెక్నీషియన్
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
- ENEG టెక్నీషియన్
- MRI టెక్నీషియన్
- స్పీచ్ థీరపిస్ట్
- డార్క్ రూమ్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- C – arm టెక్నీషియన్
- స్పీచ్ తెరపిస్ట్
- OT టెక్నీషియన్
- EEG టెక్నీషియన్
- డయాలసిస్ టెక్నీషియన్
- జనరల్ డ్యూటీ అటెండెంట్
- ECG టెక్నీషియన్
- కార్డియాలజీ టెక్నీషియన్
- క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్
- పెర్ఫ్యూజనిస్ట్
- అనస్తీసియా టెక్నీషియన్
- డ్రైవర్ ( హెవీ వెహికల్ )
- ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం వెకేషనల్ కౌన్సిలర్
- యోగా థెరపిస్ట్ / డాన్స్ టీచర్ / మ్యూజిక్ టీచర్ / ఆర్ట్ టీచర్ పార్ట్ టైం
- రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్
- న్యూక్లియర్ మెడికల్ టెక్నీషియన్
- ఫిజికిస్ట్ / న్యూక్లియర్ ఫిజికిస్ట్
- రేడియోలాజికల్ ఫిజికిస్ట్
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి 10వ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , సంబంధిత విభాగాలలో కోర్సులు ఉత్తీర్ణత సాధించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అవసరమగు వయస్సు :
- పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉంది.
- ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ,
- ప్రభుత్వ నియమ నిబంధన మేరకు అభ్యర్థులకు వయో సడలింపు లభిస్తుంది.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును ప్రింట్ తీసుకొని , ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి , 22/09/2025 సాయంత్రం 05:00 గంటల లోగా office of the principal , GMC , Guntur వారికి సమర్పించి , ఎకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
🔥 దరఖాస్తు కొరకు అవసరమగు దృవపత్రాలు :
- పదవ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సర్టిఫికెట్
- విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు
- క్వాలిఫైయింగ్ పరీక్షకు హాజరైన సర్టిఫికెట్లు
- విద్యార్హత కి సంబంధించి మార్క్స్ మెమోలు
- ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ / ఎలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ మొదలగు బోర్డులకు సంబంధించి వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
- నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం ( అవసరమగువారు )
- EWS సర్టిఫికెట్ ( అవసరమగువారు )
- సదరం సర్టిఫికెట్ ( అవసరమగువారు )
- సర్వీస్ సర్టిఫికేట్
- ఇతరత్రా ఏమైనా సర్టిఫికెట్లు
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వంద మార్కులు గాను ఎంపిక జరుగుతుంది.
- ఇందులో భాగంగా విద్యార్హత కి సంబంధించిన ఉత్తీర్ణత మార్కుల శాతం ఆధారంగా 75% వెయిటేజీ లభిస్తుంది.
- విద్యార్హతను సంపాదించిన సంవత్సరం ఆధారంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున గరిష్టంగా 10% వెయిటేజ్ లభిస్తుంది.
- 15% వెయిటేజ్ అన్నది అవుట్సోర్సింగ్ / కాంట్రాక్ట్ / కోవిడ్ 19 విధులు నిర్వర్తించిన వారికి వారి సర్వీస్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.
🔥 జీత భత్యాలు :
- ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి , వారు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా జీతభత్యాలు లభిస్తాయి.
- గరిష్టంగా 61960 రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 09/09/2025
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 10/09/2025
- దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ : 22/09/2025 సాయంత్రం 05:00 గంటల లోగా
- తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల తేదీ : 14/10/2025
- అభ్యంతరాల స్వీకరణ తేదీ : 21/10/2025
- ఫైనల్ మెరిట్ జాబితా విడుదల తేదీ : 01/11/2025
- ఎంపిక అయినవారి జాబితా విడుదల తేదీ : 07/11/2025
- కౌన్సిలింగ్ మరియు పోస్టింగ్ ఇచ్చే తేదీ : 14/11/2025
👉 click here for notification 1
👉 click here for notification 2