AP Government New Health Insurance Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మరో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ఆమోదించారు.
రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కవర్ అయ్యేలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లభించేలా కొత్తగా ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ ఆరోగ్య భీమా పథకం ఏ విధంగా అమలు కానుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య శ్రీ పథకం ఎలా భాగం కానుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఏ విధంగా ఉపయోగపడుతుంది వంటి వివిధ అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.
✅ ఏపీలో పదో తరగతి అర్హతతో ఆశ కార్యకర్త ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 రాష్ట్రంలో కొత్త ఆరోగ్య విధానం – ప్రజలందరికీ అందరికి ఆరోగ్య భీమా (New health policy in the state – Health insurance for all people :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులు అందరికీ వర్తించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య విధానాన్ని ఆమోదించింది.
- గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ఆరోగ్య విధానానికి ఆమోదముద్ర వేశారు.
- రాష్ట్రంలో ఇప్పటికీ అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ మరియు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పథకం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాలను సమ్మిళితం చేసి , కొత్త హైబ్రిడ్ ఆరోగ్య విధానాన్ని అమలు చేయడం జరగనుంది.
- రాష్ట్రంలో గల ప్రజలందరికీ ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారు.
- ఈ పథకం ద్వారా పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించనున్నారు.
🔥 కొత్త ఆరోగ్య భీమా పథకం అమలు చేయు విధానం (Implementation procedure of the new health insurance scheme) :
- రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసింది గాను రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచేందుకు నిర్ణయించింది.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ ఆరోగ్య విధానానికి సంబంధించి భీమా కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించేందుకుగాను వీలుగా వైద్య మరియు ఆరోగ్య శాఖ అందజేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.
- రాష్ట్రంలో గల అందరికీ 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా అనగా 2.5 లక్షల నుండి 22.5 లక్షల వరకు గల మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలను అందించనున్నారు.
✅ కౌశలం సర్వేలో ఇలా అప్లై చేయండి – Click here
🔥 ఎవరెవరికి ఈ ఆరోగ్య భీమా పథకం వర్తించనుంది (Who will be covered by this health insurance scheme?) :
- రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్రంలో గల పేదలందరికీ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది.
- రాష్ట్రంలో గల ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.
- ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పథకంలో భాగం అయిన వారికి తప్ప మిగతా అందరు ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది.
- దారిద్రరేఖకు ఎగువన ఉన్నవారికి (APL) వారికి 2.5 లక్షల వరకు వైద్య భీమా అందిస్తారు.
- రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ ఆరోగ్య విధానంలో భాగం కానున్నారు.
🔥 ఆరు గంటలలో ఉచిత వైద్యానికి అనుమతి :
- ఈ పథకంలో నమోదైన ప్రజల ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్ నందు జాయిన్ అయితే వారికి హాస్పిటల్లో జాయిన్ అయినా 6 గంటలలోగా ఉచిత వైద్యం లభించేలా చర్యలు తీసుకుంటారు.
- హాస్పిటల్ బిల్లులను కేవలం 15 రోజుల్లోనే రియంబర్స్ చేస్తారు.
- 3257 వైద్య సేవలను ఈ పథకంలో భాగంగా ప్రజలందరికీ అందజేస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో అయితే 324 వైద్య సేవలకు గాను ఈ పథకం వర్తిస్తుంది.
- హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి పేషంట్ కి కూడా క్యూఆర్ కోడ్ కేటాయించి , వీరికి అందుతున్న వైద్య సేవలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు.
- ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కాల్ సెంటర్ & కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తారు.
- ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సి ఉన్నందున యుద్ధ ప్రాదిపాతికన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నందు రిజిస్టర్ కాబడిన 2493 నెట్వర్క్ హాస్పిటల్స్ లలో కూడా ఈ క్రొత్త యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పథకం వర్తిస్తుంది.
- రాష్ట్రంలో గల ప్రజలందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లో భాగం కావాలన్న మంచి ఉద్దేశ్యం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
🔥 10 వేల కోట్లకు పైగా ఆర్థిక భారం :
- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కొరకు పెద్ద మొత్తంలోనే డబ్బులు వెచ్చించాల్సి ఉంది.
- ఈ పథకం అమలు కొరకు సుమారుగా పదివేల కోట్ల నుండి 12 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
- ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి జరగనుంది.
- ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
- ఇందులో భాగంగా ఈ సేవలను పొందుతున్న వారిలో 95 శాతం మంది ప్రజలకు 2.5 లక్షల లోపు ఖర్చు అవుతుంది. ఇంకో 5 శాతంలో 3 శాతం మందికి 5 లక్షల వరకు & 2 శాతం వారికి 15 లక్షల లోపు ఖర్చు అవుతున్నట్లు గణాంకాలు ద్వారా తెలుస్తుంది.
- ఈ ధనాంకర్ ఆధారంగా అధికారులు పంపించిన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
- రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 2.5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించేలా అధికారులు ప్రతిపాదించారు.
- మిగతా మొత్తానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డు ఇవ్వనున్నారు.
ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్యక్రమానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం అధికారికంగా రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయున ఈ ఆరోగ్య బీమా పథకం సంబంధించి లభించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది.







