AP ANM Notification 2025 Details : ఇంటర్మీడియట్ పూర్తి చేసి మెడికల్ రంగంపై ఆసక్తి ఉన్న మహిళలకు కి శుభవార్త ! మెడికల్ రంగంలో ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫ్ (ANM) గా కోర్స్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి 2025 – 26 విద్యా సంవత్సరం లో అడ్మిషన్లు పొందేందుకు గాను అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రస్తుత సమాజంలో వైద్యరంగంలో ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ (ANM ) / MPHW(F) కోర్స్ పూర్తి చేసిన వారికి అనేక ఉపాధి అవకాశాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

17 సంవత్సరాల నిండి యున్న మహిళలు అందరూ కూడా ఈ రెండేళ్ల కోర్సు ను పూర్తి చేయవచ్చు . ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఏఎన్ఎం కోసం పూర్తి చేయడానికి కావలసిన విద్యా అర్హతలు ఏమిటి ? వయస్సు ఎంత ఉండాలి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

వీరికి ఉచితంగా మోటార్ వాహనాలు ఇస్తున్న ప్రభుత్వం – Click here

🔥AP ANM / MPHA (F) నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి (CH & FW ,AP) వారి కార్యాలయం నుండి ఈ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
  • ఈ నోటిఫికేషన్ ద్వారా ANM/MPHW (F) ట్రైనింగ్ కోర్సు కొరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎంపిక కొరకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) వాళ్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
  • అభ్యర్థుల ఎంపిక నిమిత్తం అవసరమైన సూచనలను ఈ నోటిఫికేషన్ లో ప్రస్తావించారు.

🔥AP ANM/ MPHW (F) కోర్సు పూర్తి చేసేందుకు అవసరమగు విద్యార్హతలు :

  • మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) – MPHW(F) ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసేందుకు గాను ఇంటర్మీడియట్ లో ఏదైనా గ్రూప్ నందు ఉత్తీర్ణతను కనీస విద్యార్హతగా తెలియజేశారు.

🔥AP ANM / MPHW (F) కోర్సు లో జాయిన్ అయ్యేందుకు అవసరమగు వయస్సు :

  • ANM / MPHW (F) కోర్సులో జాయిన్ అయ్యేందుకు 31/12/2025 నాటికి కనీసం 17 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
  • ఇటువంటి గరిష్ట వయోపరిమితి లేదు. 17 సంవత్సరాల నుండి ఎంత వయస్సు ఉన్నా సరే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥AP ANM / MPHW (F) సీట్లు వర్గీకరణ :

ANM / MPHW (F) కోర్సులో సీట్లను రెండు రకాలుగా వర్గీకరించారు , అవి :

  1. ప్రభుత్వ సంస్థలు మరియు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలలో ఉన్న అన్ని సీట్లను ఉచితంగా పొందవచ్చు.
  2. ప్రభుత్వ సంస్థలలో ఉన్న మొత్తం సీట్లలో 60 శాతం సీట్లు ఉచిత సీట్లు గాను , మిగతా 40 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటగాను నిర్ణయించారు.

🔥ANM / MPHW (F) కోర్స్ లో జాయిన్ అయ్యేందుకు దరఖాస్తు చేయు విధానం :

  • ANM / MPHW (F) కోర్స్ నందు జాయిన్ కావాలి అని భావిస్తున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.
  • ప్రైవేట్ శిక్షణ సంస్థలలో ఉచిత మరియు మేనేజ్మెంట్ సీట్ల కొరకు ఒక్కొక్క దానికి సెపరేట్ గా ప్రత్యేక దరఖాస్తులు ఫిల్ చేయాల్సి వుంటుంది.
  • దరఖాస్తు తో పాటు సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి , జిల్లా DM&HO కార్యాలయం వద్ద అందచేయాలి.
  • అభ్యర్థులు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కార్యాలయానికి దరఖాస్తు ను తేదీ : 30/09/2025 సాయంత్రం 5:00 గంటల లోగా సమర్పించాలి.

🔥దరఖాస్తు తో పాటు జత చేయవలసిన ధ్రువపత్రాలు :

  • 1. పదవ తరగతి సర్టిఫికేట్
  • 2. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
  • 3. కుల ధ్రువీకరణ పత్రం ( SC/ ST/BC వారు)
  • 4. నివాస ధ్రువీకరణ పత్రం / నాల్గవ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , ఆంధ్రప్రదేశ్ వారి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్. ( SC/ST/BC వారికి ఫీజు మినహాయింపు కలదు)

🔥ANM / MPHW (F) కోర్స్ కొరకు సీట్లు ఎంపిక విధానం :

  • ANM / MPHW (F) కోర్సు కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను సెలక్షన్ కమిటీ ఉచిత సీట్ల కొరకు ఎంపిక చేస్తుంది.
  • సెలక్షన్ కమిటీలో సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు మరియు జిల్లా వైద్య శాఖ అధికారి వారు మెంబర్ కన్వీనర్ గా ఉంటారు.
  • కమిటీలో సభ్యులుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు మరియు సంస్థ యొక్క ప్రిన్సిపల్ గారు ఉంటారు.
  • వీరు కనీస విద్యార్హత అనగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను కోర్సు కొరకు ఎంపిక చేస్తారు.
  • ఫ్రీ సీట్స్ మరియు మేనేజ్మెంట్ సీట్స్ ఎంపిక విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటిస్తారు.

ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు – Click here

🔥ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పించడానికి ప్రారంభ తేదీ : 01/08/2025
  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి మరియు దరఖాస్తు సంప్రదించడానికి చివరి తేదీ : 30/09/2025
  • DM & HO కార్యాలయంలో సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ చేయు తేదీ : 15/10/2025
  • శిక్షణ తరగతులు ప్రారంభం : 21/10/2025

👉 Click here for Official website

👉 Click here for detailed notification

👉 Click here for admission notification

👉 Click here to download Application