రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Notification 2025

RRB Section Controller Notification 2025 in Telugu : భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల భర్తీ కొరకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN No. 04 / 2025) విడుదల అయింది.

ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలకు సంబంధించి , చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే డిపార్ట్మెంట్లో సెక్షన్ కంట్రోల్లో ఉద్యోగాలకు అధిపతి ప్రాధాన్యత కలదు.

🏹 Join Our What’sApp Group – Click here

ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

అక్టోబర్ 1వ తేదిన 15,000/- జమ – త్వరగా అప్లై చేయండి – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ (The organization that released the RRB Section Controller Notification) :

  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

🔥 సెక్షన్ కంట్రోలర్ మొత్తం ఖాళీల (RRB Section Controller Total Vacancies):

  • అన్ని జోన్లలో కలిపి మొత్తం 368 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
  • జోన్లవారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Railway Section controller zone wise vacancies

🔥 వయోపరిమితి (RRB Section Controller Age Eligibility):

  • ఈ ఉద్యోగాలకు 20 నుండి 33 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/01/2026 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.

🔥 అవసరమగు విద్యార్హత & ఇతర అర్హతలు (RRB Section Controller Qualification Details):

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ / యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • విద్యార్హత నిర్ధారణ కొరకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అయినటువంటి 14/10/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • అభ్యర్థులు A – 2 మెడికల్ స్టాండర్డ్స్ కలిగి , ఫిజికల్లి ఫిట్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్.

🔥 దరఖాస్తు చేయు విధానం (Railway Section Controller Apply Process):

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారికి వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • గతంలో అకౌంట్ క్రియేట్ చేసుకొని వారు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకోవడానికి 14/10/2025 వరకు అవకాశం కల్పించారు.

🔥 దరఖాస్తు ఫీజు (Application Fee for Railway Section Controller Jobs) :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • మహిళలు , ట్రాన్స్జెండర్లు , ఎక్స్ సర్వీస్ మెన్ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ , EBC ( economically back ward class ) , దివ్యాంగులు అభ్యర్థులు 250 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి. వీరు స్టేజ్ – 1 CBT కు హాజరు అయితే 250 రూపాయలు కూడా రీఫండ్ అవుతుంది.
  • మిగతా అందరు అభ్యర్థులు ( EWS , OBC , జనరల్) 500 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. వీరికి స్టేజ్ -1 CBT హాజరు అయ్యాక 400 రూపాయలు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

🔥 ఎంపిక విధానం (Railway Section Controller Selection Process):

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి సింగల్ స్టేజ్ కంప్యూటర్ బేస్ టెస్ట్ (CBT) , కంప్యూటర్ బేస్డ్ ఆటిట్యూడ్ టెస్ట్ (CBAT) , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ విధానం :

  • ఈ పరీక్ష లో 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులు గాను 120 నిమిషాల సమయం కేటాయించారు.
  • 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం కలదు.
  • ఈ పరీక్ష అనేక షిఫ్ట్ ల వారీగా జరుగుతుంది కావున నార్మలైజేషన్ విధానం ఉంటుంది.

🔥CBT సిలబస్ :

  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు ఈ క్రింది సిలబస్ ఉంటుంది.
  1. ఎనలైటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాబిబిలిటీ ( 60 మార్కులు ) : ఇందులో రెండు విభాగాలు కలవు. A. మ్యాథమెటిక్స్. B. డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్
  2. లాజికల్ క్యాపబిలిటీ ( 20 మార్కులు ) : ఇందులో కూడా రెండు విభాగాలు ఉంటాయి. A. లాజికల్ రీజనింగ్. B. రీడింగ్ కాంప్రహెన్షన్.
  3. మెంటల్ రీజనింగ్ ( 20 మార్కులు )

🔥 జీతభత్యాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 7వ CPC లో 6 లెవెల్ క్రింద 35,400/- రూపాయల ఇనిషియల్ పే తో పాటుగా ఇతర అన్ని అలవెన్సులు లభిస్తాయి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 14/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 15/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 14/10/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా పేమెంట్ చేయుటకు చివరి తేదీ : 16/10/2025
  • దరఖాస్తులు ఏవైనా తప్పులు నమోదు చేసి ఉంటే సవరణ చేసేందుకు అవకాశం కల్పించే తేదీలు : 17/10/2025 నుండి 26/10/2025 వరకు.
  • అర్హత కలిగిన అభ్యర్థులు స్క్రైబ్ వివరాలు నమోదు చేసుకునే తేదీలు : 27/10/2025 నుండి 31/10/2025 వరకు.

👉 Click here for notification

 👉 Click here for official website

Related Posts

RBI Grade B Notification 2025 Exam Dates | RBI Latest jobs Notification
  • adminadmin
  • September 11, 2025

RBI Grade B Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) సర్వీసెస్ బోర్డు సంస్థ నుండి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B (Officers in grade B) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.…

Read more

Continue reading
రైల్వేలో 2865 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు | ఎలాంటి పరీక్ష లేదు

ఇండియన్ రైల్వేస్ ! ఎంతోమంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సంస్థ రైల్వేస్ లో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలతో పాటు అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు కూడా ప్రతీ సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల అవుతూ వుంటాయి. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *