
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహించి , సంక్షేమ పథకాల అమలు కచ్చితంగా జరుగుతుంది అని మరొక సారి పునరుద్ఘాటించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ఆటో రిక్షా , మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలానే పలు సంక్షేమ పథకాలు కి సంబంధించి అప్డేట్స్ కూడా లభించాయి. ఈ అన్ని అంశాల అప్డేట్స్ కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు .
🔥 కౌశలం సర్వే గడువు తేదీ పొడిగింపు :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను ఉద్దేశించిన కార్యక్రమం కౌశలం.
- గ్రామ , వార్డు సచివాలయం సిబ్బంది యొక్క లాగిన్ ద్వారా మరియు సొంతంగా కూడా కౌశలం సర్వే నందు రిజిస్టర్ చేసుకోవచ్చు.
- కనీస విద్యార్హత కలిగి వున్న వారు అందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
- ఆధార్ కార్డ్ , ఫోన్ నెంబర్ , ఇమెయిల్ , విద్యార్హత వివరాలు మరియు విద్యార్హత సర్టిఫికెట్ లు ఉపయోగించి ఈ సర్వే నందు రిజిస్టర్ చేసుకోవాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే లో రిజిస్టర్ అయ్యేందుకు గాను గతంలో సెప్టెంబర్ 15 వ తేదీని చివరి తేదీగా తెలుపగా ఇప్పుడు కౌశలం సర్వే లో రిజిస్టర్ అయ్యేందుకు గాను గడువు తేదీని సెప్టెంబర్ 20 వ తేదీ వరకు పొడిగించింది.
- కౌశలం సర్వే లో ఇప్పటివరకు 13.13 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. మరికొద్ది రోజులలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాబితా కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
- ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా వీలనంత త్వరగా సొంతంగా లేదా గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా కౌశలం సర్వే లో రిజిస్టర్ అవ్వండి.
🔥 తల్లికి వందనం – కొనసాగుతున్న గ్రీవెన్స్ పరిష్కారాలు :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అమలుచేసిన ప్రతిష్టాత్మకమైన పథకం తల్లికి వందనం పథకం.
- ఈ పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ లను ఇస్తూనే ఉంది.
- గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు కాబడిన గ్రీవెన్స్ లను పరిష్కారం చేస్తూ ఉన్నారు.
- గవర్నమెంట్ ఎంప్లాయ్ , ఇన్కమ్ టాక్స్ గ్రీవెన్స్ లను సెప్టెంబర్ 15 లోగా పూర్తి చేయాలను అధికారులకు ఆదేశాలు జారీ కాబడ్డాయి.
- అలానే వివిధ కారణాల చేత పేమెంట్ ఫెయిల్ అయిన మొత్తం 39,285 మంది కి సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి మళ్ళీ పేమెంట్ అప్డేట్ చేయనున్నారు.
- అలానే అర్హత కలిగి ఉండి , ఇంకా పేమెంట్ కాని వారికి ప్రతి శుక్రవారం కూడా పేమెంట్ చేయబడుతున్నాయి అని ప్రాధమిక సమాచారం కూడా ఉంది.
🔥 సెప్టెంబర్ 17 నుండి ఆటోడ్రైవర్ లకు 15,000/- రూపాయలు కొరకు కొత్త దరఖాస్తులు :
- ఇటీవల జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు , మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కు సంవత్సరానికి 15,000/- ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.
- ఇందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయం లోనే దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పిస్తారు.
- సెప్టెంబర్ 17 వ తేదీ సెప్టెంబర్ 19 వ తేదీ వరకు నుండి నూతన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
- డిపార్ట్మెంట్ వారు వద్ద ఉన్న డేటా ఆధారంగా 2.75 లక్షల దరఖాస్తులు వెరిఫికేషన్ కొరకు ఎనేబుల్ అవుతాయి. ఇందులో పేర్లు లేని వారు మాత్రమే నూతనంగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ లో భాగంగా లబ్ధిదారులు అందరి చేత EKYC కూడా నమోదు చేస్తారు.
- సెప్టెంబర్ 22 వ తేదీ లోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి , సెప్టెంబర్ 24 వ తేదీ నాటికి తుది అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల చేస్తారు.
- అర్హత కలిగిన వారందరికీ కూడా అక్టోబర్ 01 వ తేదీన ముఖ్యమంత్రి వారు నగదు విడుదల చేస్తారు.
🔥 మీ ఇంటి వద్ద కే స్మార్ట్ రేషన్ కార్డ్ :
- ఆగస్టు 25 వ తేదీ నుండి పంపిణీ చేయబడుతున్న స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కొనసాగుతుంది.
- మొత్తం నాలుగు విడతల్లో పంపిణీ చేసేందుకు షెడ్యూల్ చేయగా ఇప్పటికే మూడు విడతల పంపిణీ ప్రారంభం అయ్యింది. నాల్గవ విడత పంపిణీ కూడా ప్రారంభం కానుంది.
- రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించి , అధికారులకు పలు అదేశాలు జారీ చేయడం తో పాటు వివిధ అంశాలను తెలిపారు.
- అక్టోబర్ 31 వరకు రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది అని తెలిపారు. అలానే రేషన్ కార్డు లో తప్పులు ఉంటే సచివాలయం వద్దకు వెళ్లి ఉచితంగా సరిదిద్దుకోవచ్చు అని తెలిపారు.
- తప్పులను సరిచేసుకున్న తర్వాత వారికి కొత్త కార్డులు కూడా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.
- అలానే సెప్టెంబర్ 15 వ తేదీ నుండి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డు లో తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించనున్నారు.