
Koushalam Survey Registration Process : రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌశలం సర్వే (Koushalam) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామంది అభ్యర్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ ఆశావాహులు ఈ సర్వేలో గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా రిజిస్టర్ అయ్యారు.
అయితే ఈ సర్వే గతంలో కేవలం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల లాగిన్ లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండేది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు ఈ కౌశలం సర్వేలో సొంతంగా రిజిస్టర్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఆసక్తి కలిగిన వారు సొంతగా రిజిస్టర్ చేసుకోవచ్చు. 10 వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు కొరకు అర్హులు.
కౌశలం సర్వేలో సొంతంగా ఎలా రిజిస్టర్ అవ్వాలి ? అవసరం పత్రాలు ఏమిటి ? నమోదు చేయవలసిన వివరాలు ఏమిటి ? సొంతంగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ నుంచి చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
Table of Contents
🔥 Koushalam Survey Highlights (కౌశలం సర్వే – ప్రధానాంశాలు) :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను , అవసరమైన వారికి నైపుణ్యాలు కల్పించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం అనే పేరుతో గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే నిర్వహిస్తుంది.
- రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్య సంస్థలలో 5 లక్షలకు పైగా ఉద్యోగాల అవసరం ఉంది. అదే విధంగా ఎంతో మంది నైపుణ్యం కలిగిన వారు , టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్నారు.
- ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం అయిన ఈ సర్వే ను సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది.
- ఇటీవల గ్రామ మరియు వార్డు సచివాలయం విభాగం డైరెక్టర్ గారు నిర్వహించిన సమీక్ష లో అక్టోబర్ మొదటి వారం నుండి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు.
🔥Current Status of Koushalam Survey (కౌశలం సర్వే ప్రస్తుత స్థితి) :
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అమలు లో ఐటిఐ , డిప్లొమా, డిగ్రీ , బి.టెక్, అంత కన్నా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారు డేటా ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్వే కొరకు ఎనేబుల్ చేసింది.
- మొత్తం 27.92 లక్షల మంది డేటా ను పొందుపరచగా ఇందులో 10.03 లక్షల మంది సర్వే మాత్రమే పూర్తి అయ్యింది.
- ఇంకా చాలా మంది అభ్యర్థుల సర్వే పూర్తి కావాల్సి ఉంది. అలానే సర్వే లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పేర్లు, వచ్చిన పేర్లు కాకుండా ఇతరుల వివరాలు కూడా సర్వే ద్వారా నమోదు చేసేందుకు అవకాశం ఉంది.
- గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ఇంటిని సందర్శించినప్పుడు సర్వే లో పేర్లు వచ్చిన వారు అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాలలో ఉన్న వారు OTP ల ద్వారా సర్వే కి కి నిరాకరించడం వంటి చాలా కారణాల వలన ఈ సర్వే మందకొడిగా సాగుతుంది.
- వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పౌరులు వారంతట వారే ఈ సర్వే లో భాగస్వామ్యులు అయ్యేందుకు అవకాశం కల్పించింది.
🔥 Koushalam Survey Registration Process :
- ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశలం సర్వే లో భాగస్వాయం అవ్వాలి అనుకుంటున్న వారు ఇప్పుడు నేరుగా స్వయంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
- సచివాలయం ఉద్యోగుల ద్వారా మాత్రమే కాకుండా , ఆసక్తి కలిగిన పౌరులు అందరూ తమంతట తాముగా రిజిస్టర్ అయ్యే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
- ముందుగా క్రింద ఇవ్వబడిన లింక్ ను ఓపెన్ చేయాలి.
- తర్వాత వారి ఆధార్ కార్డు ను ఎంటర్ చేసి , ఆధార్ లింక్ కాబడిన ఫోన్ నెంబర్ కి వచ్చే OTP ఎంటర్ చేయాలి.
- OTP వెరిఫికేషన్ అయ్యాక సర్వే కి కావలసిన ప్రాథమిక వివరాలు ఆటోమేటిక్ గా డిస్ప్లే కాబడతాయి.
- ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి , మొబైల్ OTP వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఇమెయిల్ ఐడి నమోదు చేసుకొని , OTP ద్వారా ఇమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ యొక్క ఉన్నత విద్య (Highest Qualification) వివరాలు నమోదు చేయాలి. ఇందులో భాగంగా మీరు చదివిన కోర్సు, సబ్జెక్ట్ వివరాలు , కాలేజ్ వివరాలు నమోదు చేసుకొని మీ యొక్క విద్యార్హతలు మార్కుల పర్సంటేజ్ / CGPA వివరాలు నమోదు చేసుకోవాలి.
- చివరిగా మీ యొక్క విద్యార్హత సర్టిఫికెట్ ను, మరియు మీ వద్ద ఉన్న ఇతర ఏమైనా (కంప్యూటర్ పరిజ్ఞానం , ఏవైనా కోర్సులు, ట్రైనింగ్ సర్టిఫికెట్ లు, ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు , ఇతర ఏమైనా సర్టిఫికెట్ లను) సర్టిఫికెట్ లను అప్లోడ్ చేసి , సబ్మిట్ చేయాలి.
🔥Items required for the Koushalam Survey కౌశలం సర్వే కొరకు అవసరమగు అంశాలు :
- ఆధార్ కార్డ్
- ఆధార్ కి లింక్ కాబడిన ఫోన్
- ఈమెయిల్ ఐడి
- విద్యార్హత సర్టిఫికెట్
- ఇతర ఏమైనా సర్టిఫికెట్లు
- విద్య ను అభ్యసించిన కాలేజ్ వివరాలు
- మీ యొక్క ప్రాధమిక వివరాలు (పూర్తి పేరు , డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జిల్లా) సరిచూసుకోండి.