
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్త్రీ శక్తి పథకం పేరుతో అమలు చేయనుంది.
ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆగస్టు 9వ తేదీన అనగా రాఖీ పండుగ నాడు అధికారికంగా ప్రకటించారు.
ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ (G.O) ఈరోజు విడుదల అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ” స్త్రీ శక్తి ” పథకానికి సంబంధించిన ఈరోజు విడుదల చేసిన G.O Ms.No: 27 యొక్క సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
Table of Contents :
🔥 స్త్రీ శక్తి పథకం – ఆగస్టు 15 నుండి అమలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కొరకు శ్రీ శక్తి పథకాన్ని అమలు చేయనుంది.
- ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల మహిళలు అందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు.
- ట్రాన్స్పోర్ట్ , రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారు నుండి ఈరోజు అధికారిక జీవో విడుదలైంది.
- ఐదు కేటగిరి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఈ జీవోలో అధికారికంగా ప్రస్తావించారు.
🔥 G.O లో గల ముఖ్యాంశాలు :
- 04/08/2025 నాడు జరిగిన సమావేశం లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని స్త్రీ శక్తి పథకం (Stree shakti scheme) అనే పేరు మీదుగా అమలు చేస్తున్నారు.
- ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC ) / ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (APPTD) ద్వారా 5 కేటగిరీల బస్ ల నందు అమలు చేస్తున్నారు.
- స్త్రీ శక్తి పథకం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అనగా స్త్రీలు రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి అయినా ఏ ప్రాంతానికి అయినా ఉచితంగా ప్రయాణించవచ్చు.
- ఆగస్టు 15 / 2025 వ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న బాలికలు , మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ప్రయాణ సమయంలో వీరు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డ్ ను రుజువుగా సమర్పించాలి. ఐడి ప్రూఫ్ ఉంటేనే వీరిని లబ్ధిదారులుగా గుర్తిస్తారు.
- రాష్ట్రంలో ఈ పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్ లతో ప్రారంభిస్తారు. అవసరాన్ని బట్టి మరియు ప్రజల నుండి వచ్చే స్పందన ఆధారంగా బస్ ల సంఖ్యను పెంచుతారు. ఇందుకు గాను అవసరమైతే అదనపు బస్ లను కొనుగోలు చేస్తారు.
- ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలు ఎనక్లేవ్ రూట్ సర్వీసులు లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
- నాన్ స్టాప్ బస్ లు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక , సూపర్ లగ్జరీ , సప్తగిరి ( తిరుమల) , అల్ట్రా డీలక్స్ , స్టార్ లైనర్, కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్ , చార్టెడ్ సర్వీసెస్ , ప్యాకేజీ టూర్ లు , ఏ సి బస్ లలో ఈ పథకం వర్తించదు.
- పల్లె వెలుగు , అల్ట్రా పల్లె వెలుగు , సిటీ ఆర్డినరీ , మెట్రో ఎక్స్ ప్రెస్ మరియు ఎక్స్ ప్రెస్ సర్వీస్ లలో ఉచిత బస్ ప్రయాణం పథకం ను వినియోగించుకోవచ్చు.
- మహిళా ప్రయాణికులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు మరియు మహిళా కండక్టర్ లకు శరీరానికి ధరించే కెమెరా లను సరఫరా చేస్తారు. అవసరాన్ని బట్టి బస్ లలో సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయవచ్చు.
- ఈ పథకం ద్వారా లబ్ది పొందే ప్రజల సౌకర్యార్థం అన్ని బస్ స్టేషన్ లలో ఫ్యాన్ లు , కుర్చీలు , త్రాగు నీరు సౌకర్యం మరియు టాయిలెట్ వసతులు వంటి పలు సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.
- ఈ పథకాన్ని విస్తరించేందుకు గాను కేబినెట్ ఆమోదానికి లోబడి విద్యుత బస్ లు కొనుగోలు చేయనున్నారు.
- ఈ పథకం ద్వారా ప్రయాణించే అర్హత కలిగిన మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్ ను అందిస్తారు.
- జీరో ఫేర్ టికెట్ ఆధారంగా సంబంధిత ఖర్చును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APSRTC వారికి రీయింబర్సెంట్ చేయనుంది.
- ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ మరియు E.O & APSRTC , M.D గార్లు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.