
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వ తేదీ నుండి “స్త్రీ శక్తి ” పథకాన్ని ప్రారంభించింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు , ఉప ముఖ్యమంత్రి శ్రీ కోనిదెల పవన్ కళ్యాణ్ గారు , విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మొదలగు వారు ఈ స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
వీరందరూ ఉండవల్లి నుండి విజయవాడ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీ శక్తి పథకం యొక్క పూర్తి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీ శక్తి పథకం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పటినుండో వేచి చూస్తున్న , సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి స్వాతంత్ర దినోత్సవం నుండి ప్రారంభించింది.
- ఉద్యోగాల కొరకు , ఉపాధి కొరకు , కూలి పనుల కొరకు వెళ్లే మహిళలు ఉచితంగా ఎటువంటి ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చని , మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పేర్కొన్నారు.
🔥 ఈ ఐదు రకాల బస్ లలో ప్రయాణం పూర్తి ఉచితం :
- రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ఇప్పటికే జీవో విడుదల చేయడం జరిగింది.
- జీవో లో ప్రస్తావించిన విధంగానే క్రింద పేర్కొన్న ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అవి :
- 1. పల్లె వెలుగు బస్ లు
- 2. అల్ట్రా పల్లె వెలుగు బస్ లు
- 3. సిటీ ఆర్డినరీ బస్ లు
- 4. ఎక్స్ ప్రెస్ బస్ లు
- 5. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ లు
- ఈ బస్ లలో మహిళలు ఉచితంగా ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు , జిల్లాలు మారినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందు కొరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
🔥 ఉచిత బస్సు ప్రయాణం పథకం కొరకు 8,548 బస్ లను కేటాయించిన ప్రభుత్వం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి సంబంధించి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు , వారి ప్రయాణం సౌకర్యవంతంగా సుఖవంతంగా ఉండేందుకు , మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్న మొత్తం 11,449 బస్ లలో 8,458 బస్ లను ఈ పథకం కొరకు కేటాయించారు.
- రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని బస్సులు కూడా కండిషన్ లో ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా , దర్జాగా ప్రయాణించేలా చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదేశించారు.
🔥 జీరో ఫేర్ టికెట్ & రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ :
- మహిళలు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని వినియోగించుకునేటప్పుడు వారు జీరో ఫెయిర్ టికెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
- ఈ జీరో ఫైర్ టికెట్ లో స్త్రీ శక్తి పథకం లబ్దిదారు ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రయాణిస్తున్నారు మరియు మొత్తం టికెట్ ధర ఎంత ? ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ వివరాలు వంటివి ప్రస్తావించబడి వుంటాయి.
- మహిళల భద్రత దృశ్యా బస్ లను సెల్ ఫోన్ లోని ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
🔥 ఉచిత బస్ ప్రయాణం కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :
- స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్ లలో ఉచితంగా ప్రయాణించేందుకు గాను మహిళలు గుర్తింపు కార్డ్ లను చూపించవలసి వుంటుంది. జిరాక్స్ కాపీలకు అనుమతి లేదు.
- మహిళలు ఆధార్ కార్డు , రేషన్ కార్డ్ , ఓటర్ ఐడి కార్డ్ మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము ద్వారా గుర్తింప బడిన ఏదైనా గుర్తింపు కార్డ్ ను చూపించవచ్చు.
- గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలు మరియు సాఫ్ట్ కాపీ లను కూడా అనుమతించే అంశము పై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
🔥 ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం :
- స్త్రీ శక్తి పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురు అవుతాయి అన్న అంశము పరిశీలిస్తున్నాం అని , ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గారు అన్నారు.
- వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని , ఆటో డ్రైవర్లకు సహాయం చేయనున్నారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని ప్రకటించారు.
🔥 స్త్రీ శక్తి పథకం పై ముఖ్యమంత్రి గారి సమీక్ష :
- స్త్రీ శక్తి పథకం ను ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు పథకం అమలు పై సమీక్ష నిర్వహించారు.
- గుర్తింపు కొరకు ఆధార్ జిరాక్స్ కాపీ ల వినియోగం మరియు మొబైల్ ఫోన్ లో సాఫ్ట్ కాపీ లను గుర్తింపు కార్డ్ లుగా ఉపయోగించడం పై అనుమతి అంశాన్ని పరిశీలిస్తున్నారు.
- ఇప్పటి వరకు 12 లక్షల మంది మహిళలకు పైగా ఉచిత బస్ ప్రయాణం ను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
- వచ్చే సోమవారం నుండి అధికంగా మహిళలు ఉచిత బస్ ప్రయాణం ను వినియోగించుకోనున్నారు అని తెలుస్తుంది.
- ఘాట్ రోడ్ లలో కూడా ఉచిత బస్ ప్రయాణం ను అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
🔥ఉచిత బస్ ప్రయాణం ట్రాన్స్ జెండర్ ల కూడా :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం రాష్ట్రంలో ఉన్న అందర మహిళలతో పాటుగా ట్రాన్స్ జెండర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.
- ట్రాన్స్ జెండర్లు కూడా మహిళల వలే ఎటువంటి పరిమితులు లేకుండా స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
- వీరితో పాటుగా రాష్ట్రంలో ఉన్న స్కూల్ విద్యార్థులకు కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.