
రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ( NTR BHAROSHA PENSION) పథకం ద్వారా పంపిణీ చేస్తున్న దివ్యాంగుల (Disable pensions ) మరియు ఆరోగ్య పెన్షన్ల (Health pensions) ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా అనర్హత కలిగిన పెన్షన్ దారుల వివరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్ నిలుపుదల చేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో కూడా వివిధ కేటగిరీ వర్గాల వారు కి పెన్షన్ పంపిణీ యధావిధిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యొక్క సమీక్ష నిర్వహించి (REVIEW MEETING) అర్హత కలిగిన ఏ ఒక్కరికి పెన్షన్ ఆగకూడదు అని , కేవలం అనర్హత కలిగివున్న వారికి మాత్రమే నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలానే పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ప్రకారం ఎవరికి పెన్షన్ కొనసాగుతుంది ? ఎవరికి మార్పు చేసిన పెన్షన్ అందుతుంది ? అనే వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 దివ్యాంగుల పెన్షన్ రద్దుచేసి వీరికి వితంతు పెన్షన్ మంజూరు :
- రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ / అనారోగ్య పెన్షన్ పొందుతూ ఉన్న మహిళలు లో ఎవరైనా దివ్యాంగుల పెన్షన్ / అనారోగ్య పెన్షన్ కొరకు ఇటీవల జరిగిన రీ అసెస్మెంట్ ప్రక్రియ లో అనర్హత కలిగి వున్న వారికి ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది.
- వీరిలో ఎవరైనా వితంతువులు ఉంటే వారికి వితంతు పెన్షన్ (WIDOW PENSION) మంజూరు చేసి , నెలకు 4,000 రూపాయలు చొప్పున మంజూరు చేయనుంది.
- అనారోగ్య మరియు దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ కి అనర్హత పొందిన వారిలో వితంతువులు ఉంటే వారి వివరాలు సేకరించాలని , వారికి వితంతు పెన్షన్ మంజూరు చేసి నాలుగు వేల రూపాయల మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
- ఈ ప్రక్రియను ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేసి , వితంతువులు గుర్తించాలి అని ఆదేశాలు ఉన్నాయి.
✅ డిగ్రీ అర్హతతో 750 ఉద్యోగాలు – Click here
🔥18 సంవత్సరాల లోపు వయస్సు గల మానసిక వైకల్య దారులకు పెన్షన్ కొనసాగింపు :
- ఇటీవల జరిగిన రీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాల వయసు లోపు కలిగి ఉండి , మానసిక వైకల్యం కేటగిరీలో పెన్షన్ పొందుతున్న వారికి పెన్షన్ రద్దు చేయవద్దని, వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు యధాతధంగా పంపిణీ చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పేర్కొంది.
- మానసిక వైకల్యం కలిగి 18 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఇటీవల జరిగిన రీ అసెస్మెంట్ ప్రక్రియతో సంబంధం లేకుండా , పెన్షన్ పంపిణీ కొనసాగించనున్నారు. వీరికి జారీ చేసిన నోటీసులను కూడా తిరిగి వెనక్కి తీసుకుంటారు.
- మానసిక వైకల్యం విభాగంలో ఎవరైతే 18 సంవత్సరాలు లోపు వయసు కలిగి అనర్హత నోటీసులను అందుకున్నారో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అధికారులు తెలియజేశారు.
🔥 తాత్కాలిక సదరం కలిగిన వారికి కూడా పెన్షన్ రద్దు కాదు :
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పై సమీక్షలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయడు గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- అర్హత కలిగిన ఏ ఒక్కరికి పెన్షన్ రద్దు కాకూడదని వారికి మాత్రమే పెన్షన్ రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు.
- ఇటీవల జరిగినది అసెస్మెంట్ ప్రక్రియలో తాత్కాలిక సదరం పొందిన దివ్యాంగులకు మరియు ఆరోగ్య పెన్షన్ దారులకు గతంలో వలె పెన్షన్ పంపిణీ చేయాలని , అధికారులకు ఆదేశించారు.
- దివ్యాంగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , అర్హులు అందరికి పెన్షన్ పంపిణీ యధావిధిగా కొనసాగుతుంది అని చెప్పారు.
- అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లను పొంది ఉన్నవారు , అన్ని విధాల ఆరోగ్యం కలిగిన వారు , ఎటువంటి వైకల్యం లేని వారు పెన్షన్ పొందుతూ ఉన్నారని అధికారులు యొక్క పరిశీలన లో తేలడం తో , ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పరిచి పెన్షన్ దారులను రీ అసెస్మెంట్ ప్రక్రియ చేసి , అనగత ఫంక్షన్ దారులు ఉన్నారని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
- సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి గారు నకిలీ సదరం సర్టిఫికెట్లు పొందిన వారు తప్ప అర్హత కలిగిన ఏ ఒక్కరికి కూడా ఫంక్షన్ రద్దు కాకూడదని అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.
- కావున వితంతు పెన్షన్ కి అర్హత కలిగి ఉన్న వారందరికీ కూడా నాలుగువేల రూపాయలు పెన్షన్ , దివ్యాంగుల పెన్షన్ కి అర్హత కలిగిన వారికి 6000/- పెన్షన్ , ఆరోగ్య పెన్షన్లు కొరకు అర్హత కలిగిన వారికి వారి అనారోగ్యత దృష్ట్యా 10 వేల రూపాయలు మరియు 15 వేల రూపాయలు పెన్షన్ అందజేయడం జరుగుతుంది.
✅ వీరికి ఉచితంగా మొబైల్స్ పంపిణీ – Click here
🔥 కొనసాగుతున్న అప్పీల్ ప్రక్రియ :
- రాష్ట్రంలో పెన్షన్ అనర్హత నోటీసులు పొందిన పెన్షన్ దారులు ఆపిల్ చేసేందుకు గాను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ వారి లాగిన్ నందు అవకాశం కల్పించారు.
- ఎవరైనా తాము నిజంగా పెన్షన్ పొందేందుకు అర్హులమని భావిస్తే , వీలైనంత త్వరగా అభివృద్ధి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు
- ఇందుకుగాను గ్రామ , వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా అందజేసిన పెన్షన్ రద్దు / పెన్షన్ మార్పు నోటీసు , పాత సదరం సర్టిఫికెట్ , కొత్త సదరం సర్టిఫికేట్ / ఎండార్స్మెంట్ , ఆధార్ కార్డ్ వంటి ద్రోపత్రాలు తీసుకొని వెళ్లి మండల అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
- వీరికి మరలా రీ అసెస్మెంట్ కొరకు నోటీసు జారీ చేస్తామని, డాక్టర్ల రీఅసెస్మెంట్ ప్రక్రియలో వీరు అర్హులు అని తేలితే , కొత్త సదరం సర్టిఫికెట్ అందజేసి వారికి పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు..