
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ లలో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రెండవ సారి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉచిత సీట్లు పొందేందుకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు ? చివరి తేదీ ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేస్తారు వంటి ఇతర అన్ని అంశాలకు సంబంధించి ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
🔥 ప్రైవేట్ స్కూల్స్ లో 25 శాతం సీట్లు ఉచితంగా సీట్లు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ మరియు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద మరియు బలహీన వర్గాలకు కేటాయించిన 25 శాతం సీట్లు భర్తీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా కొన్ని సీట్లు మిగిలిపోయినందున నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 అర్హత వయస్సు :
- CBSE/ IB / ICSE సిలబస్ ను అనుసరిస్తున్న పాఠశాలల నందు జాయిన్ అయ్యేందుకు గాను 02/04/2019 నుండి 31/03/2020 మధ్య జన్మించి , ఐదు సంవత్సరాలు వయసు నిండి ఉన్నవారు అర్హులు.
- స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలో జాయిన్ అయ్యేందుకు గాను 02/06/2019 నుండి 31/05/2020 మధ్య జన్మించి , ఐదు సంవత్సరాలు వయసు నుండి ఉన్నవారు అర్హులు.
🔥 ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో గల సచివాలయం / ఇంటర్నెట్ సెంటర్ / మండల విద్యాశాఖాధికారి కార్యాలయం / మీ – సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥ప్రాధాన్యత :
- RTE చట్టం సెక్షన్ 12 (C) ప్రకారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు మరియు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు సొంత రాష్ట్రంలో వారికి దగ్గరలో గల ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ స్కూల్ నందు 25 శాతం మందికి ఉచితంగా సీట్లను కేటాయిస్తారు. ఇందులో భాగంగా
- ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు వారు ( అనాధ పిల్లలు , H.I.V భాదితులు మరియు దివ్యాంగులు ) వారికి 5 శాతం
- షెడ్యూల్ కులాల వారికి 10 శాతం
- షెడ్యూల్ తెగల వారికి 4 శాతం
- బలహీన వర్గాలకు చెందిన బీసీ , మైనారిటీ మరియు ఓసి వారికి 6 శాతం సీట్లు కేటాయిస్తారు.
🔥దరఖాస్తు కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :
- తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ / ఓటర్ కార్డ్ / ఉపాధి హామీ కార్డు / పాస్ పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ / రెంటల్ అగ్రిమెంట్ / కరెంట్ బిల్లు వంటి ధ్రువపత్రాలు ద్వారా ప్రస్తుత చిరునామా ను నిర్ధారిస్తారు.
- పిల్లల వయస్సు ధృవీకరణ కొరకు జనన ధృవీకరణ పత్రం
🔥ఎంపిక ప్రమాణాలు :
- దరఖాస్తు చేసుకున్న వారిలో ముందుగా పాఠశాల నుండి ఒక కిలోమీటర్ లోపు నివాసం ఉన్న వారి దరఖాస్తులు పరిగణించబడతాయి.
- ఆ తర్వాత పాఠశాలల నుండి 3 కిలోమీటర్ లు లోపు నివసిస్తున్న దరఖాస్తులు పరిగణలోకి తీసుకుంటారు.
- నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో తోబుట్టువులు చదువుతూ ఉన్నట్లయితే వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 12/08/2025
- ఆన్లైన్ విధాన ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 20/08/2025
- దరఖాస్తులను పరిశీలించే తేదీ : 21/08/2025
- సీట్ల ఎంపిక కొరకు లాటరీ తీయు తేదీ : 25/08/2025
- అడ్మిషన్లు ఖరారు చేయు తేదీ : 31/08/2025