
వాహన మిత్ర పథకం అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్స్, అప్లై చేయు విధానం వివరాలు ఇవే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రంగ సిద్ధం చేసింది. ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కలిగి ఉన్న వారందరికీ సంవత్సరానికి 15,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేశారు. దసరా పండగ కానుకగా పథకాన్ని అమలు చేయనున్నారు.
గతంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటుగా ఆటో కలిగి వున్న వారు మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అందరికీ దసరా నాటికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు.
✅ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here
ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధమైన డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? షెడ్యూల్ ఏ విధంగా ఉంది ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 వాహన మిత్ర పథకం (Vahana Mithra Scheme) ద్వారా ఆటో రిక్షా – మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా – మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయనుంది. ఈ పథకానికి వాహన మిత్ర (Vahana Mithra Scheme) అనే పేరు పెట్టింది.
- ఈ పథకం అమలుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి గారు అధికారిక ప్రకటన చేశారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రయాణం కొరకు ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అమలు కావడం వలన రాష్ట్రంలోల ఆటో , క్యాబ్ , టాక్సీ డ్రైవర్లకు జీవనోపాధిలో ఇబ్బందులు ఏర్పడతాయి అన్న కారణంగా వారికి ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
- ✅ ఇలాంటి ప్రభుత్వ పథకాల ప్రతిరోజూ మీ మొబైల్ లో వాట్సాప్ కు రావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
✅ Join Our What’s App Group – Click here
🔥 వాహన మిత్ర (Vahana Mithra Scheme) పథకానికి ఎవరు అర్హులు :
- ఈ పథకానికి సంబంధించి సొంత వాహనం (ఆటో , టాక్సీ , మ్యాక్సీ క్యాబ్) కలిగి ఉండి డ్రైవర్ అయి ఉండాలి.
- ఆటో / లైట్ మోటార్ వెహికల్ నడిపేందుకు గాను చెల్లుబాటు అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- వాహనంపై రిజిస్ట్రేషన్ మరియు టాక్స్ పత్రాలు కలిగి వుండాలి.
- ఈ పథకం కేవలం పాసింజర్ వెహికల్స్ కి మాత్రమే వర్తిస్తుంది , ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వర్తించదు.
- దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు మరియు రైస్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- ఒక కుటుంబానికి ఒక వాహనంపై మాత్రమే లబ్ధి చేకూరుస్తారు.
- కుటుంబంలో ఒకరి పేరు న వాహనం రిజిస్టర్ కాబడి , మరొకరి పేరు న డ్రైవింగ్ కలిగి ఉన్నా కూడా పథకానికి అర్హత కలిగి ఉంటారు.
🔥 వాహన మిత్ర పథకం (Vahana Mithra Scheme) కు దరఖాస్తు చేయు విధానం :
- ఈ పథకానికి సంబంధించి గ్రామా మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారి వద్ద ఉన్న డేటాను , వెరిఫికేషన్ నిమిత్తం సచివాలయ ఉద్యోగులు లాగిన్ కి పంపిస్తారు.
- కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు గ్రామ మరియు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
- గ్రామ వార్డు సచివాలయం లో గల డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు నూతన దరఖాస్తులు ను వారి లాగిన్ ద్వారా అప్లై చేస్తారు.
✅ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు – Click here
🔥 వాహన మిత్ర పథకానికి (Vahana Mithra Scheme) అవసరమయ్యే ధృవపత్రాలు :
- దరఖాస్తు ఫారం
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంట్ ( NPCI – ఆధార్ కి లింక్ కాబడిన)
🔥 వెరిఫికేషన్ ప్రక్రియ :
- ఈ పథకానికి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు నూతన దరఖాస్తు చేస్తారు.
- సంబంధిత దరఖాస్తులను గ్రామ సచివాలయంలో గల సంక్షేమ మరియు విద్యా సహాయకులు , వార్డు సచివాలయంలో డెవలప్మెంట్ సెక్రటరీ వారు వెరిఫికేషన్ చేస్తారు.
- ఆ తర్వాత సంబంధిత దరఖాస్తులు మండల పరిధిలో అయితే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి వారు , మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ వారు అప్రూవల్ చేయాల్సి వుంటుంది.
- చివరిగా జిల్లా కలెక్టర్ గారు యొక్క తుది ఆమోదం తర్వాత అర్హులు జాబితాను తయారు చేస్తారు.
- ఆ తర్వాత అర్హుల జాబితాను విడుదల చేసి , ఆర్థిక సహాయంను విడుదల చేస్తారు.
🔥 వాహన మిత్ర పథకం అమలు కొరకు షెడ్యూల్ విడుదల :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కొరకు అధికారిక షెడ్యూల్ ను విడుదల చేసింది.
- ఈ కార్యక్రమం అనేది గ్రామ, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా అమలు అవుతుంది.
- GSWS డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే ఉన్న 2.75 లక్షల డేటాను గ్రామ మరియు వార్డు సచివాలయం కి పంపించు తేదీ : 12/09/2025
- గ్రామ మరియు వార్డు సచివాలయం లలో నూతన దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేదీ : 17/09/2025
- గ్రామ మరియు వార్డు సచివాలయంలో నూతల దరఖాస్తుల స్వీకరణ కొరకు చివరి తేదీ : 19/09/2025
- ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు గాను చివరి తేదీ : 22/09/2025
- ఫైనల్ అర్హుల జాబితా విడుదల తేదీ : 24/09/2025
- గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ చేయు తేదీ : 01/10/2025
ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే మీకు మరొక ఆర్టికల్ లో సమాచారాన్ని వివరంగా అందజేయడం జరుగుతుంది.