రాష్ట్రం లో అనర్హత పెన్షన్లు కోత | రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రకటన | అర్హత ఉంటే అప్పీల్ ఆప్షన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనర్హత పెన్షన్లు కోత విధించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో దివ్యాంగ , హెల్త్ పెన్షన్లు రీ అసెస్మెంట్ ప్రక్రియ జనవరి నెల నుండి జరుగుతూ ఉంది. ఇటీవల ఈ ప్రక్రియ చివరి దశ కి రావడం తో ప్రభుత్వం అనర్హత పెన్షన్లు తొలగించనుంది. ఇందుకు గాను అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

ఇందులో భాగంగా అనర్హత కలిగిన పెన్షన్ దారులకు పెన్షన్ రద్దు చేసేందుకు నోటీసులు మరియు అర్హత కలిగిన పెన్షన్ దారులకు సదరం సర్టిఫికెట్లు అందిస్తారు. పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

దేవాదాయ శాఖలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here

🔥 అనర్హత పెన్షన్లు రద్దు :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు లలో రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగాయని వివిధ స్థాయిలలో ఫిర్యాదులు రావడం వలన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు వెరిఫికేషన్ కొరకు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
  • ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజిబిలిటీ యాక్ట్ – 2016 ప్రకారంగా అన్ని దివ్యంగా మరియు హెల్త్ పెన్షన్లు ను వెరిఫికేషన్ / రీ అసెస్మెంట్ చేసింది.
  • హెల్త్ పెన్షన్లను పెన్షన్ దారుని ఇంటి వద్ద వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా వెరిఫికేషన్ చేశారు
  • దివ్యాంగ పెన్షన్లను ప్రభుత్వ ఆసుపత్రులలో వెరిఫికేషన్ ప్రక్రియ జరగడం అయింది.
  • వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వారికి రీ అసెస్మెంట్ జరిగిన ప్రాప్తికి కొత్త సదరం సర్టిఫికెట్లను డైరెక్టర్ సెకండరీ హెల్త్, గుంటూరు వారు జారీ చేశారు.
  • ఈ ప్రక్రియ పూర్తి అయిన వారికి ఆదేశాల మేరకు అనర్హత కలిగిన పెన్షన్లను తొలగించడం , దివ్యంగ మరియు హెల్త్ పెన్షన్లకు అనర్హత కలిగి వృద్ధాప్య పెన్షన్ అర్హత కలిగిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫంక్షన్ లో తొలగింపు మరియు పెన్షన్ల మార్పు నిమిత్తం అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది.

🔥 విధి – విధానాలు :

  • ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది ఇందులో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మునిసిపల్ కమిషనర్లు సంబంధిత చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.

🔥 నోటీస్ ఇష్యూ చేయు విధానం :

  • పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు మరియు కన్వర్షన్ నోటీసులను అందించేందుకు గాను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
  • గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వారికీ అసైన్ చేసిన క్లస్టర్లలో నోటీసులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎందుకుగాను మొబైల్ యాప్ లో డిజిటల్ టెక్నాలజీమెంట్ మరియు సంబంధిత కాపీ పై సంతకం తీసుకోవాల్సి ఉంటుంది.

🔥15,000 రూపాయలు పెన్షన్ వస్తున్నవారికి :

ప్రస్తుత పెన్షన్ రకంకొత్తగా సదరం రీ అసెస్మెంట్ జరిగిన ప్రాప్తికి వైకల్యం శాతంతీసుకోవలసిన చర్య
పెరాలసిస్ ( వీల్ చైర్ / బెడ్ రీడన్) & సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ మరియు యాక్సిడెంట్ కేసెస్ ( వీల్ చైర్ / బెడ్ రీడన్) 40 శాతం నుండి 85 శాతం లోపు గా ఉంటే సాధారణ దివ్యాంగ పెన్షన్ (6000/- ) గా మార్పు
పెరాలసిస్ ( వీల్ చైర్ / బెడ్ రీడన్) & సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ మరియు యాక్సిడెంట్ కేసెస్ ( వీల్ చైర్ / బెడ్ రీడన్40% కంటే తక్కువగా ఉంటేపెన్షన్ రద్దు చేయుట
పెరాలసిస్ ( వీల్ చైర్ / బెడ్ రీడన్) & సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ మరియు యాక్సిడెంట్ కేసెస్ ( వీల్ చైర్ / బెడ్ రీడన్వైకల్యం శాతం 40% కంటే తక్కువగా ఉన్నప్పటికీ వారికి 60 సంవత్సరాలు వయసు దాటి ఉంటే (ఆ ఇంట్లో మరి ఏ ఇతర పెన్షన్ లేకపోతే) వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయుట (4,000 /-రూపాయలు)

🔥ప్రస్తుతం 6,000 రూపాయల పెన్షన్ వస్తున్న వారికి :

ప్రస్తుత పెన్షన్ రకంకొత్తగా సదరం రీ అసెస్మెంట్ జరిగిన ప్రాప్తికి వైకల్య శాతంతీసుకోవలసిన చర్య
దివ్యాంగ పెన్షన్ ( వెహికల్ శాతం 40 మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి)40% కంటే తక్కువ వైకల్యం ఉంటేపెన్షన్ రద్దు
దివ్యాంగ పెన్షన్ ( వెహికల్ శాతం 40 మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి) వైకల్యం శాతం 40% కంటే తక్కువగా ఉన్నప్పటికీ వారికి 60 సంవత్సరాలు వయసు దాటి ఉంటే (ఆ ఇంట్లో మరి ఏ ఇతర పెన్షన్ లేకపోతే)వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయుట (4,000 /-రూపాయలు)

🔥 పెన్షన్ రద్దు మరియు పెన్షన్ మార్పు నోటీసులు ఇచ్చు విధానం:

  • పెన్షన్ రద్దు మరియు పెన్షన్ మార్పు నోటీసులు పెన్షన్ పోర్టల్ నందు అందుబాటులో ఉంచారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సంబంధిత నోటీసులను పది రోజులు లోగా పెన్షన్ దారులకు అందజేయాలి.

🔥 అప్పీల్ ప్రక్రియ :

  • ఎవరైనా పెన్షన్ దారులు రీఅసెస్మెంట్ ప్రక్రియలో జరిగిన నోటీసులో వచ్చిన దానికన్నా ఎక్కువ వైకుంఠం ఉంటుందని భావించినా , గతంలో ఇచ్చిన పెన్షన్ కు మేము అర్హులమని భావించిన యడల వారు అప్పీల్ చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
  • ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తులు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు / రిమ్స్ హాస్పిటల్స్ నందు / డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు / ఏరియా హాస్పిటల్స్ నందు మ్యాన్యువల్ మెడికల్ సర్టిఫికెట్ ను తీసుకొని అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • దరఖాస్తుదారుడు సంబంధిత అప్పీల్ లెటర్ ను మరియు మెడికల్ సర్టిఫికెట్ ను మరియు సంబంధిత ధ్రువపత్రాలను తీసుకుని , కొత్త సదరం సర్టిఫికేట్ / నోటీస్ అందిన 30 రోజులలోగా మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి / మున్సిపల్ కమిషనర్ వారికి అందజేయాలి.
  • ఆ తర్వాత ఎంపీడీవో /మున్సిపల్ కమిషనర్ వారు దరఖాస్తుదారునికి నోటీసు ఇస్తారు. ఇందులో మళ్లీ రీసెస్మెంట్ కొరకు ఎప్పుడు ఎక్కడ హాజరు కావాలి అనే వివరాలను పొందుపరుస్తారు.
  • నోటీసులో ఇచ్చిన సమాచారం ప్రాప్తికి మళ్లీ అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది.
  • అప్పీల్ చేసిన వ్యక్తి , మళ్లీ రీసెస్మెంట్ జరిగిన ప్రాప్తికి అర్హుడను భావిస్తే కొత్త సదరం సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మరియు వారికి పెన్షన్ పునరుద్ధరించడం జరుగుతుంది.

🔥 టైమ్ లైన్స్ :

  • 31/07/2025 నాటికి సదరం వి అసెస్మెంట్ ప్రక్రియ పూర్తి అయిన వారికి ఆగస్టు 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి వుంటుంది.
  • సంబంధిత ప్రక్రియ పూర్తి అయిన వారికి సెప్టెంబర్ 01 తేదీ పెన్షన్ పంపిణీ కి ప్రభావితం చేయబడతారు.

👉 Click here for official Memo

  • Related Posts

    ఈ తేదిన అన్నదాత సుఖీభవ పథకం 21వ విడత నిధులు జమ
    • adminadmin
    • September 25, 2025

    రైతులకు శుభవార్త ! అక్టోబర్ నెలలో వీరికి అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా లబ్ది చేకురుస్తున్నాయి. ఇందులో…

    Read more

    Continue reading
    AP Vahana Mithra Scheme Apply Process, Required Documents
    • adminadmin
    • September 14, 2025

    AP Vahana Mithra Scheme 2025 Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు , మ్యాక్సీ క్యాబ్ / మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు…

    Read more

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *