
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రీఅసెస్మెంట్ ప్రక్రియ లో అనర్హత కలిగిన ఆరోగ్య మరియు దివ్యాంగ పెన్షన్ లు కొన్నింటిని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించి వారు పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నాం అని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
ఇందులో భాగంగా పెన్షన్ రద్దు అయ్యిన వారికి ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. వీరికి సంబంధించి అప్పీల్ ప్రక్రియ లో కీలక మార్పులు తీసుకువచ్చింది.
పెన్షన్ రద్దు అయిన వారు ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి ? అప్పీల్ చేసుకోవడానికి అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ కాలేదా ? ఇలా చేయండి – Click here
Table of Contents :
🔥 రాష్ట్రంలో పెన్షన్ దారులకు రీ అసెస్మెంట్ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అందిస్తున్న ఆరోగ్య మరియు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం లో భాగంగా వీరికి రీ అసెస్మెంట్ ప్రక్రియను నిర్వహించింది.
- ఇందులో భాగంగా ఆరోగ్య పెన్షన్లు కి సంబంధించి వారి ఇంటి వద్ద నే రీ అసెస్మెంట్ ప్రక్రియ నిర్వహించగా , దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం హాస్పిటల్ లో రీ అసెస్మెంట్ ప్రక్రియ నిర్వహించారు.
- ఇందుకు సంబంధించి ఏ తేదీన రీ అసెస్మెంట్ నిర్వహిస్తారు అన్న సమాచారాన్ని కూడా ముందుగానే వారికి గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా తెలియచేయడం జరిగింది.
- ఇంచుమించుగా రీ అసెస్మెంట్ ప్రక్రియ చివరి దశకు వచ్చింది.
🔥అనర్హత పెన్షన్లు తొలగింపు కొరకు నోటీసులు :
- ప్రభుత్వం నిర్వహించిన పెన్షన్ రీ అసెస్మెంట్ ప్రక్రియ లో భాగంగా 40 శాతం కంటే తక్కువ వైకల్యం కలిగి వున్న వారికి మరియు తాత్కాలిక వైకల్యం కలిగి వున్న వారికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేయబడ్డాయి.
- సంబంధిత గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేయబడ్డాయి.
- ఎవరైనా నోటీస్ అందుకున్న పెన్షన్ దారులు , తాము మరలా పెన్షన్ పొందేందుకు అర్హులం అని భావిస్తే వారు , అప్పీల్ చేసేందుకు అవకాశం కల్పించారు.
🔥 అప్పీల్ చేయు విధానం :
- రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసేందుకు నోటీస్ అనుకున్న 30 రోజుల లోగా అప్పీల్ చేసేందుకు అవకాశం ఉంది అని తెలిపింది.
- ఇందుకు గాను అధికారిక ఉత్తర్వులు లో అప్పీల్ చేసే విధానం ను ప్రస్తావించారు.
- అయితే అప్పీల్ చేసే విధానం లో మార్పులు చేసినట్లు అధికారులు తెలియచేశారు.
- గతంలో అప్పీల్ చేసేందుకు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల నుండి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ ను తీసుకోవాలి అని తెలుపగా , ప్రస్తుతం మాన్యువల్ మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు.
- అప్పీల్ చేసుకోవాలి అనుకుంటున్న వారు ముందుగా సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ వారికి అప్పీల్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
- దీనితో పాటుగా సంబంధిత ధ్రువపత్రాలు కూడా జత చేయాల్సి వుంటుంది.
✅ ఆదరణ 3.O పథకం ద్వారా ద్విచక్ర వాహనాలు పంపిణీ – Click here
🔥 అప్పీల్ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :
- ఎవరైనా పెన్షన్ దారులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మరియు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో అప్పీల్ చేసుకోవాలి అని భావిస్తే వారు ఈ క్రింది ధృవ పత్రాలు ను కూడా వారికి సమర్పించాలి. అవి :
- 1. అప్పీల్ కొరకు దరఖాస్తు
- 2. పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు నోటీస్
- 3. పాత సదరం సర్టిఫికెట్
- 4. కొత్త సదరం సర్టిఫికెట్ / ఎండార్స్మెంట్
- 5. ఆధార్ కార్డ్ జిరాక్స్
- 6. రైస్ కార్డ్ జిరాక్స్
- 7. ఇతర ధృవీకరణ పత్రాలు ఏమైనా
- 8. అలానే పెన్షన్ దారునికి సంబంధించి హాస్పిటల్ నందు చికిత్స పొందినా లేదా పొందుతున్నట్లు అయినా సంబంధిత ధ్రువపత్రాలు
- 9. ఇతర ధృవీకరణ పత్రాలు ఏమైనా.
అయితే ఈ దృవపత్రాలు కచ్చితంగా వుండాలి అన్న నిబంధన ఏమి లేదు , ఎందుకు అనగా ఏది కేవలం అప్పీల్ ప్రక్రియ మాత్రమే.
🔥అప్పీల్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ? :
- అప్పీల్ ప్రక్రియ కి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
- అప్పీల్ ప్రక్రియ అన్నది మండల స్థాయి , మున్సిపల్ స్థాయి లలో జరుగుతుంది.
- సంబంధిత అధికారులు అప్పీల్ ను ఆన్లైన్ విధానం ద్వారా చేయాల్సి వుంటుంది.
- అధికారులు మీరు సమర్పించిన అర్జీ నీ పెన్షన్ పోర్టల్ నందు అప్లోడ్ చేసి , తదుపరి కార్యాచరణ జరుపుతారు.
- ఆ తర్వాత ఒక షెడ్యూల్ ప్రకారం అప్పీల్ చేసుకున్న వారు ఏ తేదీన మళ్ళీ రీ అసెస్మెంట్ కొరకు హాస్పిటల్ కి హాజరు కావాలి అన్న విషయాన్ని మళ్ళీ నోటీస్ ఇచ్చి తెలియచేస్తారు.
- పెన్షన్ అప్పీల్ విషయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే గ్రామ వార్డు సచివాలయం లను సంప్రదించవచ్చు.
🛑Note on Appeal Process🛑
- Applicants who received notices of ineligibility under the Disabled Pension can appeal for re assessment by submitting their request to the nearest MPDO / Municipal Commissioner.
- ✅ Authorities will upload the request on the Pension Portal for further processing in SADAREM portal.
- ✅ PD-DRDA will schedule appeal visits in coordination with Medical Superintendents of GGH & DCHS.
- PWDs will receive another notice with date, time & hospital details to attend verification.
- ℹ️ For details, PWDs can contact Village/Ward Secretariat officials.