
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన పధకం “తల్లికి వందనం“. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూలై 12వ తేదీ న అమలు చేసింది. అయితే అప్పటికే ఒకటవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి కాకపోవడం వలన వారికి తర్వాత కాలంలో మరో సారి అర్హుల మరియు అనర్హుల జాబితాను ఇచ్చింది.
అయినప్పటికీ ఇంకా చాలా మంది విద్యార్థుల పేర్లు అర్హుల మరియు అనర్హుల జాబితాలో పేర్లు రాకపోవడం తో లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఈ అంశాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను ఆగస్టు 15వ తేదీన మళ్ళీ విడుదల చేసింది.
✅ Join Our What’sApp Group – Click here
ఈ అంశానికి సంబంధించి అర్హుల జాబితాను ఏ విధంగా తెలుసుకోవాలి? వీటికి నగదు క్రెడిట్ అవుతుందా? అలానే తల్లికి వందన పథకం కి సంబంధించి ఇతర అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరుగుతుంది.
Table of Contents
🔥తల్లికి వందనం పథకం వివరాలు :
- కూటమి ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో ఇచ్చిన హామీ మేరకు ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో విద్యార్థికి 15,000/- రూపాయలు చొప్పున మంజూరు చేసింది. ఇందులో భాగంగా 13,000/- రూపాయలు తల్లుల ఖాతాలలో మరియు 2,000/- రూపాయలను స్కూల్ అభివృద్ధి కొరకు కేటాయించారు.
- ప్రభుత్వం జూలై 12 న ఈ పథకం ను అమలు చేసింది.
🔥 కొనసాగుతున్న తల్లికి వందనం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ:
- తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేసిన తర్వాత గ్రీవెన్స్ నమోదు కొరకు అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా అర్హత కలిగి వున్న వారు అనర్హత జాబితాలో ఉంటే వారు గ్రామ, వార్డ్ సచివాలయం లో గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలి. సంబంధిత వివరాలను డేటా బేస్ ప్రకారం పరిశీలించి లబ్ధిదారులు అర్హులు అయితే వారికి నగదు జమ చేయడం జరుగుతుంది.
✅ ANM కోర్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
🔥 తల్లికి వందనం పథకం కొత్త అర్హుల జాబితా విడుదల :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 12వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయక ఇంటర్మీడియట్ మరియు ఒకటవ తరగతి విద్యార్థులు అడ్మిషన్లు పూర్తి కాకపోవడంతో వారికి కొంత సమయం తర్వాత వారికి జాబితాలో పొందుపరచడం జరిగింది.
- అయినప్పటికీ చాలామంది లబ్ధిదారుల పేర్లు కొత్త జాబితాలోను పేర్లు లేనందువలన ఆందోళన చెందడం జరిగింది.
- ఈ అంశాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం & 1వ తరగతి విద్యార్థుల జాబితాను మరొకసారి పరిశీలించి , జూలై 10 / 2025 తర్వాత అడ్మిషన్ పొందిన వారి పేర్లు కూడా అర్హుల మరియు అనర్హుల జాబితాలో జత చేయడం జరిగింది.
- ఎవరి పేర్లు అయినా గతంలో మిస్ అయి ఉంటే వారు మీ గ్రామ లేదా వార్డు సచివాలయం లో కొత్త అర్హుల జాబితాలో పేర్లు వచ్చాయా లేదా అని చెక్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
- మీ గ్రామ , వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి మీరు జాబితాను పరిశీలించవచ్చు.
🔥 ఆధార్ నెంబర్ తప్పు వలన నగదు జమ కాలేదా – కొద్ది రోజులు వేచి చూడండి :
- తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ ప్రక్రియను పరిశీలిస్తూ ముందడుగు వేస్తుంది.
- చాలామంది లబ్ధిదారులకు , తల్లి ఆధార్ నెంబర్ లేదా విద్యార్థి ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు కావడం చేత నగదు జమ కాలేదు.
- వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అవార్డు సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు కొరకు అవకాశం కల్పించినప్పటికీ , స్కూల్ డేటా బేస్ నందు వివరాలు సరి చేయకపోవడం వలన వారు ఈ పథకానికి అర్హులు కాలేకపోయారు.
- ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి స్కూల్ డేటా నందు కూడా వివరాలు సరిచేయాలని స్కూల్ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
- ఇందులో భాగంగా స్కూల్ యాజమాన్యాలు కూడా వారి యొక్క udise నందు మరియు ఇతర పోర్టల్స్ నందు కూడా తప్పుగా నమోదు కాబడిన విద్యార్థి మరియు తల్లి ఆధార్ నెంబర్లను సరి చేయడం జరిగింది.
- ఇటీవలే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు సంబంధిత డేటాను గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ (GSWS ) కి అందించడం జరిగింది.
- GSWS డిపార్ట్మెంట్ వారు ఈ డేటాను పరిశీలించి డేటాను మరికొద్ది రోజులలో వాలిడేట్ చేయనున్నారు.
- సంబంధిత డేటాను వాలిడేట్ చేసి , మరికొద్ది రోజులలో రిమార్క్ తో పాటుగా గ్రామ వార్డు సచివాలయం లలో అర్హుల మరియు అనర్హు జాబితారు. మరొకసారి ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు.
- కావున తల్లి ఆధార్ మరియు విద్యార్థి ఆధార్ తప్పుగా నమోదైన వారు మరికొద్ది రోజులు వేచిచూస్తే వారికి నగదు జమ అయ్యేందుకు అవకాశం కలదు.
🔥 కరెంట్ మీటర్ ల సమస్య ?:
- రాష్ట్రంలో తల్లికి వందనం పథకంకు సంబంధించి కరెంటు సమస్య వేధిస్తూ ఉంది.
- లబ్ధిదారుల ఆధార్ కి వేరే ఇంకెవరో కరెంటు మీటర్లు లింకు కావడం చేత కొంతమంది అర్హులు అయి ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉన్నామని గ్రీవెన్స్ నమోదు చేశారు. అలానే కరెంటు మీటర్ డిసీడింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది.
- ఈ అంశానికి సంబంధించి గ్రీవెన్స్ నమోదు చేసినప్పటికీ కొంతమంది అర్హులు జాబితాలోకి రాకపోవడంతో వారు ఈ పథకానికి లబ్ధి పొందలేకపోయారు.
- అయితే డిపార్ట్మెంట్ వారు ఈ ఆధార్ డిసీడింగ్ డేటాను డేటా బేస్ నందు అప్డేట్ చేయలేదు. ఆదేశాల ప్రకారం ఈ డేటా బేస్ ను అప్డేట్ చేస్తేనే వీరికి నగదు జమ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
🔥 ఇన్కమ్ టాక్స్ & గవర్నమెంట్ ఎంప్లాయ్ సమస్యలు :
- తల్లికి వందనం పథకానికి సంబంధించి కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ పేయర్/ ప్రభుత్వ ఉద్యోగి లు ఉన్నారు అని వచ్చిన గ్రీవెన్స్ లకు సాధారణంగా వారు అర్హులై ఉండరు.
- ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నట్లు లేదా గవర్నమెంట్ ఉద్యోగి గా చూపిస్తున్న వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా లేదా వారు చనిపోయినా , అలా అయినప్పుడు మాత్రమే వారు గ్రీవెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- దీనికి సంబంధించి గ్రీవెన్స్ ను ఎవరికి అయితే సంబంధిత రిమార్క్ చూపిస్తుందో వారి ఆధార్ తో గ్రీవెన్స్ నమోదు చేసి , సంబంధిత ధృవ పత్రాలు జత చేయాలి.
- ఈ గ్రీవెన్స్ లను మరియు సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించి అధికారులు , వారు అర్హులు అయ్యుంటే వారిని అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుంది.