
తేదీ 21/08/2025 , గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఇందులో భాగంగా మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారు ప్రకటించారు.
✅ వీరికి టచ్ మొబైల్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం – Click here
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండల తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే :
Table of Contents :
🔥 క్యాబినెట్ కీలక నిర్ణయాలు :
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ లో మొత్తం 33 అంశాలకు సంబంధించిన అజెండాను మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు
- అమరావతి రాజధానికి సంబంధించి 51వ CRDA సమావేశంలో ప్రతిపాదించిన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో గల 29 గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను మొత్తం 904 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు.
- ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ మరియు 2025 – 30 సంవత్సరానికి అమలు చేసేందుకు గాను వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.O కి ఆమోదముద్ర వేశారు.
- సిఆర్డిఏ పరిధిలోగల వివిధ సంస్థలకు బుక్ కేటాయింపులు ఏ విధంగా చేయాలి అన్న అంశంపై ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్లో ఆమోదం తెలపబడ్డాయి.
- పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ భూములను ఏ విధంగా వినియోగించాలి అన్న మార్గదర్శకాలను క్యాబినెట్ ఆమోదించింది
- గ్రామ మరియు వార్డు సచివాలయాలలో నూతనంగా 2,778 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను డిప్యూటేషన్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు క్యాబినెట్ తెలిపింది.
- ప్రస్తుతం ఉన్న అధికారిక భాషా కమిషన్ పేరును ” మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ ” గా మార్పు చేసింది గాను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
- కాకినాడ – తోట వెంకటాచలం లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- పంచాయతీరాజ్ చట్టంలో గల కొన్ని సెక్షన్లను సవరించనున్నట్లు క్యాబినెట్ ప్రకటించింది.
- కడప జిల్లాలో గల మైలవరంలో 20050 మెగావాట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది గాను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
- అదానీ సోలార్ ఎనర్జీ కు 200.05 ఎకరాలు కేటాయింపు చేసేందుకు గను క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- గుంటూరు జిల్లాలో గల తెదేపా కార్యాలయ భూమి లీజు కాలపరిమితి పెంపునకు ఆమోదం.
- చిత్తూరు లో గల CHC ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు మరియు ఇందులో కొత్తగా 56 పోస్టులను మంజూరు చేసేందుకు గాను ప్రతిపాదనలను ఆమోదించారు.
- నాలా పన్నులో 70% స్థానిక సంస్థలకు 30% సంబంధిత అథారిటీలకు అందించమన్నారు.
- ఆంధ్రప్రదేశ్ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
- మద్యం యొక్క ప్రాథమిక ధరలు మరియు విదేశీమత్యం బ్రాండ్లకు సంబంధించి టెండర్ కమిటీ సిఫార్సులను ఆమోదించేందుకు నిర్ణయం తీసుకుంది.
🔥 నాలా చట్టం రద్దు – త్వరలో ఏకరూప ప్రక్రియ కొరకు చట్టం :
- రాష్ట్రంలో అమలులో ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
- ఇందుకుగాను నాలా చట్టం రద్దు ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది.
- నాలా చట్టం రద్దు చేయడంతో రాష్ట్రంలో గల పట్టణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ చట్టాలలో కూడా పలు సవరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
- వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు గతంలో ఉన్న నాలా చట్టం బదులుగా ఏక రూప ప్రక్రియను తీసుకురానున్నారు.
🔥 కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు :
- రాష్ట్రంలో కొత్తగా రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు కొరకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలోను మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి లోను గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ( PPP ) విధానంలో ఏర్పాటు చేస్తారు.
- హడ్కో సంస్థ సహాయంతో భూసేకరణ మరియు యుటిలిటీ ల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తారు అలానే ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాలలో మౌలిక సదుపాయాల కొరకు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ ప్రతిపాదనలు సమర్పించగా వాటిని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.