
కౌశలం సర్వే – Work From Home Jobs Survey : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఎన్నికల హామీలలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మరియు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన వంటివి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చదువుకొని ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది సహకారం తో గతంలో వర్క్ ఫ్రం హోమ్ (Work From Home) సర్వే ను చేయించింది.
ఇప్పుడు ఈ సర్వే లో భాగంగా మరిన్ని వివరాల సేకరణ కొరకు కౌశలం సర్వే (KOUSHALAM Survey) ను ప్రారంభించింది.
ఈ కౌశలం సర్వే ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ? ఈ సర్వే లో ఎవరు పాల్గొనవచ్చు ? సర్వే లిస్ట్ లో పేరు లేకపోతే వారు ఏం చేయాలి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 కౌశలం సర్వే ప్రధాన ఉద్దేశ్యం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను కౌశలం సర్వే ను ప్రారంభించింది.
- ఈ సర్వే లో భాగంగా ఐటిఐ, డిప్లొమా , డిగ్రీ మరియు అంత కంటే అధికమైన విద్యార్హత కలిగి ఉండి, ఇంటి నుండి పనిచేసే అవకాశాల పై ఆసక్తి కలిగి వున్న పౌరుల నుండి డేటా ను సేకరించి , రానున్న రోజులలో వారికి ఇంటి వద్ద నుండి పని (Work from home) కల్పించడం మే కౌశలం సర్వే ప్రధాన ఉద్దేశ్యం.
- ఇందుకు గాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారులకు అందరికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
- గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ఈ సర్వే నిర్వహించేందుకు గాను ఫీల్డ్ స్టాఫ్ గా గుర్తించబడ్డారు.
✅ తల్లికి వందనం పథకం కొత్త అర్హుల జాబితా విడుదల – Click here
🔥 సర్వే – నిర్వహణ విధానం :
- గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది వారికి కేటాయించబడిన కస్టర్ లలో ఈ కౌశలం సర్వే నిర్వహిస్తూ ఉంటారు.
- ఇందుకు గాను వారికి ఎంప్లాయ్ మొబైల్ యాప్ నందు ప్రీ పాపులేటెడ్ గా కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది.
- ఇందులో వచ్చిన పేర్లు గతంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించిన వర్క్ ఫ్రం హోం సర్వేలో ఎవరైతే ఆసక్తి ఉంది అని అన్నారు వారి పేర్లను ఇవ్వడం జరిగింది.
- ఇందులో భాగంగా ప్రీ పాపులేటెడ్ గా ఉన్న పేర్లను సర్వే నిర్వహించేందుకు సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాల్సి ఉంటుంది.
- మీ ఆధార్ ఓటిపి , ఈమెయిల్ ఐడి ఓటిపి , మరియు మొబైల్ నెంబర్ ఓటిపి తో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి ఆ తర్వాత మీరు చదువుకున్న వివరాలు అనగా మీ క్వాలిఫికేషన్ ఏంటి ? మీ మీ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కుల శాతం , ఏ కాలేజీలో మరియు ఏ జిల్లాలో మీ యొక్క విద్యార్హతలను పూర్తి చేశారు వంటి వివిధ అంశాలను అడిగి వాటి వివరాలను నమోదు చేస్తారు.
- చివరగా మీ యొక్క క్వాలిఫికేషన్ కి సంబంధించి సర్టిఫికెట్ ను అప్లోడ్ చేసి సర్వే ని సబ్మిట్ చేయడం జరుగుతుంది.
✅ AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥కౌశలం సర్వే లో మార్పులు :
- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రవేశపెట్టిన కౌశలం సర్వే మాడ్యుల్ నందు మార్పులు తీసుకువచ్చింది.
- గతంలో ప్రవేశపెట్టిన మాడ్యూల్ లో ఇమెయిల్ OTP తప్పనిసరిగా ఉండగా , ఇప్పుడు దానిని ఆప్షనల్ గా ఇచ్చారు.
- అలానే గతం లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ గా ఐటిఐ , డిగ్రీ , డిప్లమా, పీజీ లు ఉండగా ఇప్పుడు ఐటిఐ, డిప్లొమా , డిగ్రీ , పీజీ తో పాటు ఇంటర్, పదవ తరగతి , 10వ తరగతి కంటే తక్కువ విద్య పూర్తి చేసిన వారికి కూడా కౌశలం సర్వే లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
- అలానే ప్రస్తుతం డిగ్రీ , ఐటిఐ , డిప్లొమా, పీజీ చదువుతున్న (PURSING) వారు కూడా సర్వే లో పాల్గొనవచ్చు.
🔥సర్వే లో పాల్గొనేందుకు అవసరమగు వివరాలు & ధృవ పత్రాలు :
- ఇమెయిల్ ఐడి (OTP వెరిఫికేషన్ కొరకు)
- మొబైల్ నెంబర్ (OTP వెరిఫికేషన్ కొరకు)
- ఆధార్ కి లింక్ అయిన మొబైల్ (OTP వెరిఫికేషన్ కొరకు)
- హైయెస్ట్ క్వాలిఫికేషన్ వివరాలు ( 10th, ఇంటర్ , ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ)
- క్వాలిఫికేషన్ అభ్యసించిన కాలేజ్ పేరు మరియు సంబంధిత వివరాలు
- మార్కుల శాతం లేదా సిజిపిఏ
- సర్టిఫికెట్ హార్డ్ కాపీ ( అప్లోడ్ కొరకు)
🔥 కౌశలం సర్వే లో మీ పేరు లేదా ? అయితే ఇలా చేయండి :
- రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన హోమ్ సర్వేలో 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు గల వారి పేర్లు రావడం జరిగింది.
- అందులో ఎవరైతే వర్క్ ఫ్రం హోం ఉపాధి అవకాశాల కొరకు ఆసక్తి చూపిస్తామని అప్పుడు చెప్పారు వారి పేర్లు మాత్రమే సర్వేలో రావడం జరిగింది.
- ఇప్పుడు గతంలో వివరాలు ఇచ్చేటప్పుడు వర్క్ ఫ్రం హోం కొరకు ఆసక్తి నీ చూపించిన వారి పేర్లు సర్వే నుండి మినహాయించారు.
- గతంలో వర్క్ ఫ్రం హోం సర్వేకి అనాసక్తి చూపి పేరు ఇవ్వనివారు, ఇప్పుడు మీరు వర్క్ ఫ్రం హోమ్ సర్వే లో భాగస్వామ్యం అవ్వాలి అనుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- ఎవరైనా కౌశలం సర్వేలో పేర్లు లేని వారు మీరు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందిని సంప్రదించి, వారి మొబైల్ యాప్ లో కౌశలం మాడ్యుల్ లో ఆధార్ సెర్చ్ (Adhar Search) ఆప్షన్ ద్వారా అడిషనల్ కౌంట్ గా సర్వేలో పాల్గొనవచ్చు.
- ఆ తర్వాత సర్వే కి సంబంధించి వివరాలు సచివాలయం సిబ్బంది వారికి అందజేయవలసి ఉంటుంది.