
ఆదరణ 3.O పథకం ద్వారా గీత గీత కార్మికులకు లబ్ధి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన చాలా పథకాలు అమలు చేస్తుంది. ఇవే కాకుండా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా లేని చాలా సంక్షేమ పథకాలు మరియు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గీత కార్మికుల కొరకు ఆదరణ 3.O పథకాన్ని తీసుకొని వస్తుంది.
గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆదరణ పథకం ను ప్రారంభించారు.
ఇప్పుడు ప్రభుత్వం ఆదరణ 3 పథకాన్ని కూడా ప్రారంభించనుంది.
ఆదరణ 3 పథకం అంటే ఏమిటి ? ఈ పథకం ద్వారా ఎలాంటి లబ్ది చేకూరుతుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది ? వంటి ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం సర్వే – Click here
Table of Contents
🔥 ఆదరణ 3.O పథకం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ఒక గొప్ప సంక్షేమ పధకం “ఆదరణ పథకం“.
- బీసీ కులాల వారికి స్వయం ఉపాధి కల్పించడానికి , వారి సంక్షేమ కొరకు ఈ పథకాన్ని అమలు చేశారు.
- ఆదరణ పథకం ద్వారా బీసీ కులాలకు చెందిన సంప్రదాయ వృత్తుల వారికి మరియు చేతి వృత్తులు వారికి ఆధునిక పనిమిట్లు మరియు పరికరాలు సబ్సిడీతో అందించడం జరుగుతుంది.
- సంబంధిత వర్గాల వారికి ఆదరణ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం ద్వారా వారు వారి యొక్క ఉత్పాదికత పెంచబడి , వారి ఆదాయం పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
- బీసీ కులాల వారి ఆర్థిక స్థితిగతులు పెంచేందుకు , వారు సమాజంలో ఉన్నతంగా బతికేందుకు గాను , వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
- ఆదరణ పథకం ద్వారా కళ్ళు గీత కార్మికులు , కుమ్మరి , కమ్మరి , నాయి బ్రాహ్మణులు , రజకులు , భవన నిర్మాణ కార్మికులు , గొర్రెల కార్మికులు , వడ్డెర , చేనేత కార్మికులు , ఇతర చేతివృత్తుల వారు మరియు దినసరి కూలీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.
✅ LIC లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 అతి త్వరలో ఆదరణ 3.O పథకం ప్రారంభం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ , జౌళి , చేనేత సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎస్. సవిత గారు ఆదరణ 3.O పథకంపై కీలక ప్రకటన చేశారు.
- గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కులాల అభ్యున్నతి కొరకు ఆదరణ 3.0 పథకాన్ని పున ప్రారంభిస్తున్నారని ప్రకటించారు.
- ఆదరణ 3.0 పథకం ద్వారా గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను అందించాలని నిర్ణయించినట్లు మంత్రిగారు తెలిపారు.
- ఆదరణ 3.0 పథకం ద్వారా రాష్ట్రంలో గల అర్హత కలిగిన గీత కార్మికుల అందరికీ వారి జీవనోపాధి అయిన చెట్లు ఎక్కడానికి అత్యాధునిక పరికరాలను అందించడం జరుగుతుంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యాధునిక పరికరాలను 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందజేస్తారు. లబ్ధిదారులు కేవలం 10 శాతం నగదు జమ చేస్తే సరిపోతుంది.
- అదేవిధంగా గీత కార్మికులకు ప్రయాణాల కొరకు ద్విచక్ర వాహనాలను అందజేయడం జరుగుతుంది.
- ఆదరణ 3.0 పథకం ద్వారా గీత కార్మికులకు జీవనోపాధి కొరకు రుణాలు కూడా మంజూరు చేస్తారు. వీరికి మూడు అంచెలుగా రుణాలు అందజేయడం జరుగుతుంది.
- గీత కార్మికుల సంక్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ 3.0 పథకాన్ని ప్రతిష్టాత్మకం గా అమలు చేయనుంది.
🔥గతంలో అమలు అయిన ఆదరణ 2.0 ముఖ్యాంశాలు :
- ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు గతంలో ఆదరణ మరియు ఆదరణ 2.0 అనే పథకాలను ప్రవేశపెట్టారు.
- ఆదరణ 2.0 పథకం ద్వారా 2014 నుండి 2019 సంవత్సరం మధ్యకాలంలో మొత్తం 135 కులాలకు గాను 964 కోట్ల రూపాయల తో నాలుగు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 90 శాతం సబ్సిడీ తో పథకాన్ని అమలుపరిచారు.
- అప్పట్లోనే ఈ పథకం ద్వారా కుల వృత్తులకు అవసరమగు పరికరాలకు బట్టి 10 వేల రూపాయలు , 20 వేల రూపాయలు మరియు 30 వేల రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను అందజేసారు.
🔥 ఆదరణ 3.O పథకం – గీత కార్మికులకు అవసరమగు అర్హతలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆదరణ 3.0 పథకం కొరకు ఈ క్రింది అర్హత కలిగిన గీత కార్మికులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
- ఈ పథకం లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది , శాశ్వత నివాసితులై వుండాలి.
- ఆంధ్రప్రదేశ్ డేటా బేస్ నందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు తప్పనిసరిగా సభ్యులై ఉండాలి.
- బీసీ కులానికి చెందిన గీత కార్మికులు ఈ పథకానికి అర్హులు.
- వయస్సు 18 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాల లోపు కలిగి వుండాలి.
- BPL కుటుంబానికి చెందిన వారు అయి ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అర్హత ప్రమాణాలు సిక్స్ స్టెప్ వాలిడేషన్ కి లోబడి వుండాలి.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి , ఆదాయపు పన్ను చెల్లింపు దారులు ఉండరాదు.
- కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.
- కుటుంబ ఆదాయం గ్రామాలలో 10,000/- రూపాయలు మరియు పట్టణాలలో 12,000/- రూపాయలు లోపు ఉండాలి.
🔥దరఖాస్తు చేయు విధానం :
- ఆదరణ 3.O పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ఇంకా ప్రారంభించబడనప్పటికీ , అతి త్వరలో అవకాశం కల్పించవచ్చు.
- రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ & మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) ద్వారా అవకాశం కల్పిస్తారు.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు :
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కి లింక్ కాబడిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- మొబైల్ నెంబర్