
అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ నమోదుకు ఆగస్టు 25 చివరి తేదీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కొరకు గత ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) పథకం తో పాటుగా అరెస్టు 2వ తేదీ నుండి అమలు చేసింది.
అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి వివిధ కారణాల చేత నగదు జమ కాని వారికి , గ్రీవెన్స్ నమోదు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హత కలిగి ఉండి , నగదు జమ కాని వారు ఈ నెల 25వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలి.
ఈ గ్రీవెన్స్ నమోదు విధానం పై మరింత సమాచారం అనగా గ్రీవెన్స్ ఎక్కడ నమోదు చేసుకోవాలి ? అవసరమగు ధృవ పత్రాలు ఏమిటి ? మొదలగు వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥రైతులకు వరం – అన్నదాత సుఖీభవ :
- అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన ప్రారంభించింది.
- ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గల రైతుల అందరికీ ప్రత్యక్ష నగదు సహాయం అందిస్తారు.
- ఈ పథకం ప్రధానంగా రైతులు పంట సాగు చేసే సమయంలో పెట్టుబడి సాయంగా లభిస్తుంది.
- రైతులు పంట సాగు చేసే సమయంలో పెట్టుబడి సహాయం అందించడం వల్ల రైతులకు వారు పంటపై పెట్టే ఖర్చుపై ఉపశమనం లభిస్తుంది.
- ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ తో పాటుగా అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతుల సంక్షేమం కొరకు 20వేల రూపాయలు అందిస్తున్నారు.
🔥 అన్నదాత సుఖీభవ పథకం లక్ష్యాలు :
- ఈ పథకం ద్వారా రైతులకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు.
- రైతులకు సకాలంలో నగదు జమవుతుంది.
- ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఉత్పాదికత ను పెంచవచ్చు.
- ఈ పథకం ద్వారా CCRC (క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్) కలిగి వున్న కౌలు రైతులు కి కూడా లబ్ది చేకూరుతుంది.
- రైతులకు ఎరువులు , పంటల సాగు ఖర్చుల భారం తగ్గడం తో పాటు గా రైతుల సంక్షేమాన్ని పెంచవచ్చు.
- రైతులకు పంటల సీజన్ కి ముందే డబ్బుకు జమ చేయడం ద్వారా వారిని సంస్థాగత , సంస్థాగతేతర రుణాలు , అప్పుల బారి నుండి తప్పించవచ్చు.
🔥 అర్హత కలిగిన వారు ఈ విధంగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి :
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి ఇంకా డబ్బులు జమ కాని వారు గ్రీవెన్స్ నమోదు చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- ఇందులో భాగంగా అర్హత కలిగిన ఎవరైనా లబ్ధిదారులకు నగదు జమ కానిచో వారు ఆగస్టు 25వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- గ్రీవెన్స్ నమోదు చేసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గల రైతు సేవా కేంద్రాన్ని సందర్శించాలి.
- రైతు సేవ కేంద్రంలో గల గ్రామ వ్యవసాయ సహాయకులు కి మీరు గ్రీవెన్స్ అందజేయవచ్చు.
- ముందుగా మీ యొక్క ఆధార్ నెంబర్ తో గ్రామ వ్యవసాయ సహాయకులు సంప్రదించి అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ లో తెలుసుకోండి.
- అన్నదాత సుఖీభవ పథకం యొక్క స్టేటస్ ను తెలుసుకున్న తర్వాత గ్రామ వ్యవసాయ సహాయకులు వారు మీకు ఎందుకు నగదు జమ కాలేదో సంబంధిత కారణాలు తెలియజేస్తారు.
- ఆ తర్వాత సమస్యకు సంబంధించి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు.
- ఒకవేళ సంబంధిత గ్రీవెన్స్ వివరాలు పై అధికారులకు చేరవేయాల్సి ఉన్నచో అధికారి తమ లాగిన్ లో గ్రీవెన్స్ నమోదు చేసి పై అధికారులకు వెరిఫికేషన్ ప్రభుత్వం పంపిస్తారు.
- గ్రీవెన్స్ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత , సంబంధిత గ్రీవెన్స్ నమోదుదారులు అన్నదాత సుఖీభవ పథకానికి నిజంగా అర్హులైతే వారికి నగదు జమ అవుతుంది.
- వచ్చే అక్టోబర్ నెలలో మీ అందరికీ కూడా నాకు జమ అవుతుందని తెలుస్తుంది.
🔥 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండి ఇలా :
- అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ పధకం యొక్క స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టేటస్ ను తెలుసుకునేందుకు రైతులు అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
- వెబ్సైట్లో ” Know your Status ” పై క్లిక్ చేసి , ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులా కాదా ? ఈ కేవైసీ పూర్తయిందా లేదా ? నగదు జమ అయిందా లేదా ? లేదా ప్రాసెసింగ్ లో ఉందా అని అంశాలు అందులో డిస్ప్లే కాబడతాయి. దీనితో పాటుగా ఒకవేళ అనర్హత కలిగి ఉంటే ఏ కారణం చేత అనర్హత కలిగి ఉన్నారు అనే అంశాన్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి , వివిధ కారణాల చేత నగదు జమ కాని వారు వీలైనంత త్వరగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో గల రైతు సేవా కేంద్రంలో గల వ్యవసాయ సహాయకులను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేసుకొని , ఈ పథకం యొక్క లబ్ది ను పొందగలరని ఆశిస్తున్నాము.